Asianet News TeluguAsianet News Telugu

ముగ్గురు హాస్యనట చక్రవర్తులు కలిసిన వేళా, కోటాతో బ్రహ్మానందం,అలీ ఫోటో వైరల్

హాస్య నట చక్రవర్తులు ముగ్గురు ఒక చోట కలిశారు. తెలుగు సినీపరిశ్రమలో తారాజువ్వల్లా వెలిగిన నవ్వుల రాజులు ముగ్గురు ఆడియన్స్ కు కనువిందు చేశారు. ఇంతకీ ఈ ముగ్గరు ఎక్కడ ఎందుకు కలిశారంటే..? 
 

Comedians Brahmanandam and Ali visit Kota srinivasa Rao House JMS
Author
First Published Feb 13, 2024, 7:09 AM IST | Last Updated Feb 13, 2024, 7:21 AM IST

తెలుగు సినిమాలో హాస్యానిది అగ్రభాగం. ఒకప్పుడు హీరోలకు సమానంగా హాస్యనటులకు డిమాండ్ ఉండేది. తెలుగు పరిశ్రమలో ఉన్నంతమంది హాస్యనటులు వేరే ఏ ఇండస్ట్రీలోను లేరు. కాని ఈ పదేళ్లలో.. దాదాపు పదిమందికి పైగా గొప్ప హాస్య నటులను టాలీవుడ్ కోల్పోయింది. ఇక  ప్రస్తుతం కొత్త వారి ట్రెండ్ నడుస్తుంది. ఇక ఇప్పటికీ సీనియర్ కమెడియన్స్ సందడి చేస్తూనే ఉన్నారు. ఇక చాలా రోజుల తరువాత టాలీవుడ్ ఆడియన్స్ కోసం ముగ్గురుఅగ్ర నటులు ఫోటోకు ఫోజు ఇచ్చారు. 

టాలీవుడ్ లో అగ్ర హస్యనటులుగా కొనసాగిన బ్రహ్మానందం ఆలీతో పాటు.. కామెడీతో పాటు..విభిన్న పాత్రలు చేసి..విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకన్న కోటా శ్రీనివాస్ రావు ముగ్గురు కలిసి తాజాగా  దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోటా బ్రహ్మానందం అంటే ఎవరికైనా ఆహనా పెళ్ళంట సినిమా గుర్తకు వస్తుంది.. ఇక కోటా ఆలీ అనగానే.. వినోదం, లాంటిసినిమాలు చాలా ఉన్నాయి. ఈ కోటాతో ఆ ఇద్దరి కాంబినేషన్ సినిమాలన్నీ సూపర్ హిట్ అయినవే. ఇప్పటికీ ఆ సన్నివేశాలు.. ఎంతో నవ్వు తెప్పిస్తాయి. 

ఇక తాజాగా వీరు కలుసుకున్న ఫోటో వైరల్ అవుతోంది. కాని వీరు ఎందుకు కలిశారు. ఎక్కడ కలిశారు అన్నది అఫీషియల్ గా తెలియదు కాని ఈ పోటోలో కోటా లుంగీలో కనిపిస్తున్నారు. దాన్ని బట్టి.. కోటా శ్రీనివాసరావును  కలవడానికి బ్రహ్మానందం, అలీ వారి ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. వయోభారం వల్ల కోటా సినిమాలు చేయలేకపోతున్నారు. బ్రహ్మానందం కూడా అడపా దడపా సినిమాల్లో కనిపిస్తున్నారు కాని.. పెద్దగా ఆయన కూడా యాక్టీవ్ గా లేరు. ఇక అలీ ఒక్కరే సినిమాలు, పాలిటిక్స్ అంటూ సందడి చేస్తున్నారు. 

అనారోగ్యం 80 ఏళ్ళు రావడంతో.. వయోభారంలో ఉన్న కోటాను చూడటానికివచ్చారు ఇత్తరు తారలు. దాంతో వీరి ఫోటో నెట్టింట వైరల్అవుతుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios