సినీ నటుడు వేణుమాధవ్ సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. స్థానిక తహసీల్దారు ఆఫీస్ లో వేణుమాధవ్ నామినేషన్ పత్రాలను సమర్పించారు.
సినీ నటుడు వేణుమాధవ్ సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. స్థానిక తహసీల్దారు ఆఫీస్ లో వేణుమాధవ్ నామినేషన్ పత్రాలను సమర్పించారు.
మూడు రోజుల క్రితం నామినేషన్ వేయడానికి వెళ్లిన వేణుమాధవ్ సరైన పత్రాలు సమర్పించకపోవడంతో ఆయన నామినేషన్ ని అధికారులు రిజెక్ట్ చేశారు. దీంతో మరోసారి నామినేషన్ వేయాలని నిర్ణయించుకొని తన మద్దతుదారులతో కలిసి మరోసారి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కోదాడ తన స్వస్థలం కావడంతో ఇక్కడ నుండే ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్నానని తెలిపారు.