సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ఎంత టాలెంట్ ఉన్న పైకి రావడం కష్టం. ఈ విషయంలో తను పడ్డ కష్టం గురించి చెప్పుకొచ్చాడు కమెడియన్ వేణు.   

తాను కూడా ఒకప్పుడు అవకాశాల కోసం ఫిల్మ్ ఇండస్ట్రీలో  చెప్పులరిగేలా తిరిగానంటున్నాడు కమెడియన్‌ వేణు. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి ఎన్నో కష్టాలు పడ్డాకే తనకు ఇండస్ట్రీలో ఆఫర్‌ వచ్చిందంటున్నాడు.సినిమా ఇండస్ట్రీలో  బ్యాక్‌గ్రౌండ్‌ లేని వాళ్లు రావడం అంత ఈజీయేం కాదంటున్నాడు కమెడియన్. కొండంత ప్రతిభ ఉన్నా గోరంత లక్‌ లేకపోతే వెండితెరపై వారు అదృష్టాన్ని పరీక్షించుకోలేరు. ఒక్క చాన్స్‌, ఒకే ఒక్క చాన్స్‌ అంటూ స్టూడియోల చుట్టూ తిరిగేవారు అప్పటికీ ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నారు. 

రీసెంట్ గా కమెడియన్ వేణు ఓ ఇంటర్వ్యూలో తను పడ్డ కష్టాలను చెప్పుకొచ్చాడు.  ఇంటర్వ్యూలో వేణు మాట్లాడుతూ నేను మార్షల్‌ ఆర్ట్స్‌ పూర్తి చేశాను. రెండుసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో చాంపియన్‌గా నిలిచాను. కానీ యాక్టర్‌ అవ్వాలని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను. అన్నదానాలు పెట్టిన చోట తిని కృష్ణానగర్‌లో రోడ్ల మీద పడుకునేవాడిని. ఎలాగైనా స్క్రీన్‌లో కనిపించాలని దొరికిన అన్ని పనులు చేశాను. టచప్‌ బాయ్‌గా, మేకప్‌ అసిస్టెంట్‌గా, సెట్‌ బాయ్‌గా, కూలీగా, పేపర్‌ బాయ్‌గా పని చేశానంటున్నాడు వేణు.

నటుడిని అవ్వాలన్న కోరికతో చిరవకు  అంట్లు తోమడం దగ్గర నుంచి బాత్రూమ్‌లు కడగడం వరకు అన్నీ చేశాను. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం కోసం పరిచయాలు పెంచుకుని వాళ్లను బ్రతిమలాడి వాళ్ల రూమ్‌లో ఉన్నాను. కాకపోతే వాళ్లు నన్ను ఇంట్లో పని చేసే బాయ్‌గా ఉంచుకున్నారు. ఆ సమయంలో ఒకతని దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేశానంటున్నారు వేణు. 

ఇలా ఇంత కష్టపడ్డ వేణు చిన్నగా కమెడియన్ గా ఎదిగాడు.. సినిమాల్లో కామెడీ రోల్స్ చేస్తూనే.. జబర్ధస్త్ లో తిరుగులేని    కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోస్ తో పాటు.. బయట కూడా ఈవెంట్స్ చేసుకుంటూ తను పడ్డ కష్టానికి ప్రతి ఫలం అనుభవిస్తున్నాడు.