తమిళ సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ వడివేలుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్ గా కూడా ఆయన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. దాదాపు 18 ఏళ్ల క్రితం విడుదలియన్ 'ఫ్రెండ్స్' సినిమాలో వడివేలు.. కాంట్రాక్టర్ నేసమణి అనే పాత్ర పోషించారు.

అందులో ఆయన తలపై సుత్తి పడడంతో బలమైన గాయలవుతుంది. ఆ సన్నివేశం ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. దీంతో పలు టీవీ ఛానళ్ళు వడివేలు ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

దర్శకుడు శంకర్ నిర్మాణంలో శింబుదేవన్ దర్శకత్వంలో '24వ పులికేసి' గురించి వడివేలు మాట్లాడుతూ.. అసలు శింబుదేవన్ కి దర్శకత్వమే రాదని అన్నారు. '23వ పులికేసి'  సినిమాను కూడా చాలా వరకు తనే డైరెక్ట్ చేసినట్లు చెప్పారు. కొన్ని పాత్రలను తనే రూపొందించానని, హాస్య సన్నివేశాలను కూడా రాశానని అన్నారు. ఇక '24వ పులికేసి'లో కూడా శింబుదేవన్ ఒక లైన్ తో మాత్రమే వచ్చారని.. దీంతో అతడితో చర్చించి.. అందులో త్రిపాత్రాభినయం వచ్చేలా కథ మార్చానని వడివేలు అన్నారు.

కామెడీ సీన్స్ కూడా చెప్పానని, ఆ తరువాతే పూర్తిస్థాయి సినిమాగా మారిందని అన్నారు. దర్శకుడు శంకర్ అప్పటినుండి ఇప్పటివరకు గ్రాఫిక్స్ సన్నివేశాలతోనే దర్శకుడిగా నెట్టుకోస్తున్నారని, ఆయనో గ్రాఫిక్స్ డైరెక్టర్ అంటూ విమర్శలు చేశారు వడివేలు.