తాగుబోతు రమేష్‌ మరోసారి తండ్రి అయ్యారు. తమకు పండంటి కూతురు జన్మించినట్టు ఆయన స్వయంగా వెల్లడించారు. సోషల్‌ మీడియా ద్వారా ఈవిషయాన్ని పంచుకున్నారు.

ప్రముఖ హాస్యనటుడు తాగుబోతు రమేష్‌ మరోసారి తండ్రి అయ్యారు. తమకు పండంటి కూతురు జన్మించినట్టు ఆయన స్వయంగా వెల్లడించారు. సోషల్‌ మీడియా ద్వారా ఈవిషయాన్ని పంచుకున్నారు తాగుబోతు రమేష్‌. ఈ సందర్భంగా తన భార్య, బర్త్ చైల్డ్ తో దిగిన ఫోటోని పంచుకున్నారు. కూతురు వచ్చిన ఆనందంలో తాగుబోతు రమేష్‌ ముఖం ఆనందంతో వెలిగిపోతుండటం విశేషం. తాగుబోతు పాత్రలతో ఫేమస్‌ అయిన తాగుబోతు రమేష్‌ 2015లో స్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2017లో కూతురు పుట్టింది. తాజాగా మరోసారి చిన్నారి రాకతో రమేష్‌ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది.

View post on Instagram

ఇక `జబర్దస్త్` షోతో పాపులారిటీని సొంతం చేసుకున్న తాగుబోతు రమేష్‌.. సినిమాల్లో కమెడీయన్‌గా మెప్పించారు. ముఖ్యంగా ఆయన తాగుబోతు తరహా పాత్రలతో నవ్వులు పూయించారు. దీంతో `తాగుబోతు` అనేది తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. అనేక చిత్రాల్లో కమెడీయన్‌గా నటించిన మెప్పించారు. తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. అయితే ఇటీవల ఆయనకు సినిమాల్లో ఛాన్స్ లు తగ్గాయి. కొత్త హాస్యనటులు వస్తోన్న నేపథ్యంలో తాగుబోతు రమేష్‌కి కాస్త సినిమా ఛాన్స్ లు తగ్గుతూ వచ్చాయి. 

ఈ నేపథ్యంలో మరోసారి జబర్దస్త్ లో సందడి చేస్తున్నారు. తనదైన కామెడీతో నవ్వులు పూయిస్తున్నారు. తాగుబోతు పాత్రలే కాదు, విభిన్న పాత్రలతో మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే లేడీ క్యారెక్టర్లు కూడా చేసేందుకు ఆయన వెనకాడటం లేదు. దీంతో మళ్లీ పూర్వవైభవాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.