Asianet News TeluguAsianet News Telugu

‘F3’ కిక్కెక్కించే కొత్త న్యూస్, సూపర్ డెసిషన్ కదా

ఈ చిత్రం  క్రితం సంవత్సరం జనవరికు రిలీజ్ అయ్యి  సూపర్ హిట్టైంది. ఈ చిత్రంలో వెంకటేశ్ కామెడీ, వరుణ్ తేజ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సంవత్సరం సంక్రాంతి బరిలో ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమయ్యింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు.

comedian Sunil will join in F3
Author
Hyderabad, First Published Oct 12, 2020, 9:54 AM IST

దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘F2’. ఈ చిత్రం  క్రితం సంవత్సరం జనవరికు రిలీజ్ అయ్యి  సూపర్ హిట్టైంది. ఈ చిత్రంలో వెంకటేశ్ కామెడీ, వరుణ్ తేజ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సంవత్సరం సంక్రాంతి బరిలో ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమయ్యింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు కాకుండా మరో కీలకమైన పాత్రను అనుకున్నారు. ఆ పాత్ర సినిమా కథను మలుపు తిప్పుతుంది. మొదట ఈ పాత్రకు రవితేజ చేస్తే బాగుంటుంది అనుకున్నారు కానీ ఇప్పుడు సీన్ లోకి సునీల్ వచ్చి చేరినట్లు సమాచారం. ఇప్పటికే సునీల్ ఈ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని, ఇంటర్వెల్ ముందు వస్తుందని, మైండ్ బ్లాక్ అయ్యే రేంజిలో ఉంటుందని చెప్తున్నారు. 

ఈమద్య కాలంలో సునీల్ కు తన టాలెంట్ చూపించేందుకు సరైన ఛాన్స్ దక్క లేదు. కామెడీతో కూడిన కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారిన అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 లో నటిస్తే సునీల్ మళ్లీ బిజీ అవ్వడం ఖాయం అంటున్నారు అందరూ. ఈ ఏడాది చివరి నుండి ఎఫ్ 3 సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందట.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘‘ ‘F2’కు సీక్వెల్‌గా ‘F3’ తెరకెక్కిస్తాం.  ‘F3’ సినిమాకు వెంకటేశ్, వరుణ్ తేజ్ కూడా ఓకే చెప్పారు.బాలీవుడ్‌లో వచ్చిన ‘గోల్‌మాల్’ సినిమా సిరీస్‌లా వరుసగా తీయాలని ఉంది. త్వరలో మరో సినిమా తీయబోతున్నా. ఈ సినిమాలో కథకే ప్రాధాన్యం ఉంటుంది. ’’ అని అన్నారు.
 
 కాగా ఈ ‘F2’ సినిమాను అనిల్ రావిపూడి తెరకెక్కించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీలో వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్‌,రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌కాష్ రాజ్‌, ఝాన్నీ, వెన్నెల‌కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి, అన‌సూయ‌, ర‌ఘు బాబు, నాజర్, పృథ్వి, వై.విజ‌య‌, అన్న‌పూర్ణ‌మ్మ త‌దిత‌రులు నటించారు. దేవిశ్రీ ప్ర‌సాద్‌ సంగీతం అందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios