ప్రముఖ నటుడు శ్రీనివాసరెడ్డి తండ్రి వై.రామిరెడ్డి(82) కన్నుమూశారు. అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 24న రామిరెడ్డి మరణించారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన తనువు చాలించారు. రామిరెడ్డి తెలుగు సినిమాల్లో కూడా నటించారు. శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాలో రామిరెడ్డి ఉపాధ్యాయుడిగా నటించారు. 

ఆ విధంగా ఆయనకు సినిమాలతో కూడా బంధం ఏర్పడింది. ఇప్పుడు ఆయన మరణించడంతో సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం  చేస్తున్నారు.