ఈ మధ్యకాలంలో కమెడియన్లు హీరోలుగా మారడం చూస్తూనే ఉన్నాం. అయితే కొందరు కమెడియన్లు ఓ అడుగు ముందుకేసి దర్శకులుగా కూడా తమ టాలెంట్ పరీక్షించుకున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో కమెడియన్ చేరబోతున్నాడు.

అతడెవరో కాదు.. శ్రీనివాస్ రెడ్డి. కమెడియన్ గా తనదైన ముద్ర వేసిన ఈ నటుడు మెగాఫోన్ పట్టాడు. ఓ సినిమా కూడా తీశాడు. దాని పేరు 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు'. ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్న హాస్యనటులంతా కలిసి ఫ్లయింగ్ కలర్స్ పేరుతో ఎప్పటికప్పుడు పార్టీలు చేసుకుంటూ ఉంటారు.

అలా కలుస్తున్న వీరంతా కలిసి నిర్మాతలుగా మారి అదే పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించారు. వీరంతా కలిసి ఓ సబ్జెక్ట్ కూడా ఫైనల్ చేశారు. దానికి దర్శకత్వ బాధ్యతలను శ్రీనివాస్ రెడ్డికి అప్పగించారు. గతంలో శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రల్లో సినిమాలు వచ్చాయి. 

ఇప్పుడు ఏకంగా ఆయన డైరెక్టర్ గా మారి సినిమాలు తీస్తున్నాడు. బ్రహ్మానందం నుండి నేటితరం యంగ్ కమెడియన్స్ వరకు చాలా మంది హాస్యనటులు ఈ సినిమాలో ఉన్నారు. పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించనున్నారు.  

ఏషియా నెట్ న్యూస్ లో ఎన్నికల తాజా వార్తలు, విశ్లేషణలు.. ఇక్కడ క్లిక్ చేయండి