Asianet News TeluguAsianet News Telugu

మొదటి సారి కొడుకుని పరిచయం చేసిన రాహుల్ రామకృష్ణ, పేరు వెల్లడించిన స్టార్ కమెడియన్

మొదటిసారి తన కొడుకు పేరును ప్రకటించాడు టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ. అంతే కాదు మొదటి సారి తన ఫోటోను కూడా శేర్ చేశాడు స్టార్ కమెడియన్.  
 

Comedian Rahul Ramakrishna Reveals His Son Name and Photo jms
Author
First Published Apr 26, 2023, 10:11 AM IST

టాలీవుడ్ లోకి సైలెంట్ గా వచ్చి.. స్టార్ గా ఎదిగాడు కమెడియన్ రాహుల్ రామకృష్ణ.  ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్లు ఉన్నా.. ఎవరి స్టైల్ వారిది. అందులో తెలంగాణ ప్రాతం నుంచి వచ్చిన కొంత మంది కామెడీ ఆర్టిస్ట్ లు తమ సత్తా చాటుతున్నారు. అందులో ప్రిదర్శితో పాటు..రాహుల్ రామకృష్ణ కూడా ఒకరు. వీరు తమదైన కామెడీతో ప్రేక్షకులను అలరించారు. ఇక రాహుల్ రామకృష్ణ కూడా  తెలంగాణ యాసతో.. తనదైన కామెడీతో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. దాంతో రాహూల్ రామకృష్ణ అతి కొద్ది కాలంలోనే తెలుగులో స్టార్  కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించాడు.

ఇక ఆమధ్య తనకు కొడుకు పుట్టినట్టు ప్రకటించాడు రాహుల్.. కాని పోటో మాత్రం రివిల్ చేయలేదు. తాజాగా  రాహూల్.. తన కొడుకు ఫోటోతో పాటు.. పేరు కూడా ప్రకటించాడు. పేరు కూడా చాలా డిఫరెంట్ గా పెట్టాడు రాహుల్. గత ఏడాది హరిత అనేఅమ్మాయిని పెళ్లి చేసుకున్న రాహూల్ రామకృష్ణ.. ఆ పెళ్ళి విషయాన్ని కూడా సీక్రేట్ గా ఉంచాడు. ఇక గత నవంబర్ లో తాను తండ్రి కాబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఆతరువాత ఈ ఏడాది ప్రారంభంలో..  సంక్రాంతి రోజున తనకు కొడుకు పుట్టాడని ట్విట్ చేశాడు. కాకపోతే తన కొడుకు ఫోటో రివీల్ చేయలేదు. పుత్రోత్సాహంతో పొంగిపోయిన రాహుల్.. రీసెంట్ గా తన కొడుకుని ఫ్యాన్స్ కు పరిచయం చేశాడు. పేరు కూడా వెల్లడించాడు రాహుల్. తన కొడుకు పేరు రూమీ అని వెల్లడించాడు రాహుల్. రుమీ ఎంజాయ్ విత్ ఫ్యామిలీ అని క్యాప్షన్ పెట్టి.. ఫోటోను శేర్ చేశాడు రాహుల్. ఈ ఫోటోలో రాహుల్ భార్య  హరిత రుమీని ఎత్తుకొని ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతోంది. 

 

 

ఇక ఈ ఫోటోకు నెటిజన్ల నుంచి వరుసగా కామెంట్స్ వస్తున్నాయి.  రాహుల్ కు  కంగ్రాట్స్ రాహూల్ అన్నా.. రుమీకి స్వాగతం అంటూ... కామెంట్స్ చేస్తున్నారు.  కొంతమంది.. రుమీ అంటే ఏంటీ అని అడుగుతున్నారు. మరికొంత మంది మాత్రం జూనియర్ రాహుల్ రామకృష్ణ వచ్చేశాడు.. అని అంటున్నారు... పేరు కొత్తగా ఉందని కొందరు... అర్ధం ఏంటో చెప్పండి అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇంతకీ రుమీ అంటే ఏవరంటే.. ఓ పర్షియన్ కవిపేరు అని తెలుస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios