స్టార్ కమెడియన్ గా వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నాడు ప్రియదర్శి. ఆయన లేటెస్ట్ మూవీ జాతి రత్నాలు ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణతో కలిసి ఆయన పండించిన కామెడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. కామెడీ రోల్స్ చేసే ప్రియదర్శి ఈ సారి కొత్తగా సీరియస్ ఇంటెన్సిటీ రోల్ ఎంచుకున్నారు. 


ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ క్రైమ్ థ్రిల్లర్ గా విడుదల కానుంది. ఈ చిత్ర టీజర్ విడుదల కాగా ప్రియదర్శి సరికొత్తగా కనిపించారు. అయితే ఈ మూవీ కోసం ఆయన పెద్ద రిస్క్ చేశాడట. ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో ప్రియదర్శి కాలికి గాయం అయ్యిందట. ఇబ్బంది పెడుతున్న గాయం లెక్క చేయకుండా షూట్ పూర్తి చేశాడట ప్రియదర్శి. ఆ గాయం మానడానికి ప్రియదర్శికి మూడు నెలల సమయం పట్టిందట. 


ఈ విషయాన్ని తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహా యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. నందిని రాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి విద్యా సాగర్ ముత్తుకుమార్ దర్శకత్వం వహించారు. భాషా, డాడీ, మాస్టర్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సురేష్ కృష్ణ నిర్మిస్తున్నారు. ఆహా లో ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ మూవీ విడుదల కానుంది.