'బలగం' వేణు తర్వాత దర్శకుడిగా మారబోతున్న మరో కమెడియన్.. ఊహించని సర్ప్రైజ్ ఏంటంటే..
జబర్దస్త్ తో కెరీర్ ప్రారంభించిన మరో కమెడియన్ దర్శకుడిగా మారబోతున్నట్లు తెలుస్తోంది. కమెడియన్ గా టాలీవుడ్ లో రాణిస్తున్న ధనరాజ్ మెగా ఫోన్ పట్టబోతున్నాడు.
జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన వేణు ఇప్పుడు క్రేజీ డైరెక్టర్ గా మారాడు. వేణు తెరకెక్కించిన బలగం చిత్రం సృష్టించిన సంచలనం అలాంటిది. తెలంగాణ గ్రామీణ భావోద్వేగాలు ఎంతో అద్భుతంగా తెరక్కించిన వేణు.. బలగం చిత్రంతో భారీ విజయం అందుకున్నాడు. ప్రస్తుతం బలగం చిత్రం అంతర్జాతీయంగా అనేక అవార్డులు సొంతం చేసుకుంటోంది.
ఇదిలా ఉండగా జబర్దస్త్ తో కెరీర్ ప్రారంభించిన మరో కమెడియన్ దర్శకుడిగా మారబోతున్నట్లు తెలుస్తోంది. కమెడియన్ గా టాలీవుడ్ లో రాణిస్తున్న ధనరాజ్ మెగా ఫోన్ పట్టబోతున్నాడు. ధనరాజ్ విలేజ్ నేపథ్యం లో సాగే ఎమోషనల్ కథని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దసరా రోజు ప్రారంభించనున్నారట.
మరో ఊహించని సర్ప్రైజ్ ఏంటంటే ఈ చిత్రంలో బ్రో డైరెక్టర్ సముద్రఖని ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందట.
నిర్మాతలు ఎవరు, ఇతర వివరాలు లాంటి అంశాలు దసరా రోజున రివీల్ కానున్నట్లు తెలుస్తోంది. ధనరాజ్ కమెడియన్ గా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. దర్శకుడు కావాలన్న తన డ్రీమ్ లో భాగంగా తొలి అడుగు వేయబోతున్నారు. ధనరాజ్ బిగ్ బాస్ 1లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే.