Abhinav Gomatam : హీరోగా కమెడియన్ అభినవ్ గోమఠం..క్రేజీ టైటిల్ తో వస్తున్నాడుగా.. డిటైల్స్
మరో కమెడియన్ హీరోగా అలరించేందుకు సిద్ధమయ్యాడు. వెండితెరపై ఇన్నాళ్లు నవ్వులు పూయించిన నటుడు అభినవ్ గోమఠం Abhinav Gomatam ఇప్పుడు హీరోగా పరిచయం కాబోతున్నారు.
డాషింగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో కమెడియన్ గా అభినవ్ గోమఠం Abhinav Gomatam మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్, ఆయా చిత్రాల్లో నటించారు. ఇక 2018 నుంచి వరుసగా తెలుగు చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెండితెరపై నవ్వులు పూయిస్తున్నారు.
గతేడాది ‘విరూపాక్ష’, ‘స్పై’, ‘గాంఢీవధారి అర్జున’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటించారు. ఇక తన కెరీర్ లో మొట్టమొదటిసారిగా లీడ్ రోల్ లో సినిమా చేయబోతున్నారు. ఇన్నాళ్లు కమెడియన్ గా అలరించిన నటుడు ఇకపై హీరోగానూ ఆకట్టుకునేందుకు రెడీ అయ్యారు. తాజాగా ఆయన రాబోయే చిత్రానికి సంబంధించిన టైటిల్ తో పాటు, మూవీ డిటేయిల్స్ ను యూనిట్ విడుదల చేసింది.
ఆ వివరాలకొస్తే.. తన పాపులర్ డైలాగ్ ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా నీలో’ అందరికీ తెలిసిందే.ఈ డైలాగ్ నే తన మొదటి సినిమాను టైటిల్ గా ఫిక్స్ చేశారు. ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’ (Masthu Shades Unnai Ra) టైటిల్ నే అనౌన్స్ చేయడం సినిమాపై బజ్ ను క్రియేట్ చేసింది. హీరోయిన్ గా వైశాలి రాజ్ నటిస్తోంది. కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వీ నిర్మాతలుగా వ్యవరిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి చిత్రాన్ని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు.