Asianet News TeluguAsianet News Telugu

కక్కుర్తి,కంగారు వద్దు :'కలర్స్' స్వాతి కు అవే ముద్దు

మళ్లీ ఎలాగైనా రీఎంట్రీ ఇచ్చి బిజీ అవ్వాలనుకుంటోంది. అయితే కలర్స్ స్వాతి సినిమా చేయాలని చాలా మంది ఉత్సాహపడతారు. కాకపోతే సరైన బ్యానర్ , డైరక్టర్ లేకపోతే ఏవో అతీ,గతీ లేని సినిమాలు వస్తాయి. ఇన్నాళ్లు పోగు చేసుకున్న కీర్తి మొత్తం ఉష్ కాకే. ఇదే విషయం మీద ఆమె సన్నిహితులు సలహా ఇస్తున్నారట. ఖాళీగా ఉన్నామని ఏదో పాత్ర ఒప్పుకోవద్దు. కక్కుర్తికు పోతే మొత్తం పోతుంది. అలాగే రీఎంట్రీ విషయంలో కంగారు వద్దని చెప్తున్నారట.

Colors Swathis new innings in a web drama jsp
Author
Hyderabad, First Published Nov 24, 2020, 12:27 PM IST

కలర్స్ స్వాతికి తెలుగునాట ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె సినిమాల కోసం ఎదురుచూసే అభిమానులు ఉన్నారు. అయితేనేం ప్రస్తుతం కెరీర్ లో వెనకబడింది. వెలిగినంతకాలం వెలిగి పెళ్లి చేసుకుని ప్రక్కకు వెళ్లింది. అయితే ఓ సారి ముఖానికి మేకప్ వేసుకున్నాక మళ్లీ మళ్లీ వేసుకోవాలనిపిస్తుందంటారు నటులు. ఇప్పుడు కలర్స్ స్వాతి పరిస్దితి కూడా అదే. ఆమె మళ్లీ ఎలాగైనా రీఎంట్రీ ఇచ్చి బిజీ అవ్వాలనుకుంటోంది. అయితే కలర్స్ స్వాతి సినిమా చేయాలని చాలా మంది ఉత్సాహపడతారు. కాకపోతే సరైన బ్యానర్ , డైరక్టర్ లేకపోతే ఏవో అతీ,గతీ లేని సినిమాలు వస్తాయి. ఇన్నాళ్లు పోగు చేసుకున్న కీర్తి మొత్తం ఉష్ కాకే. ఇదే విషయం మీద ఆమె సన్నిహితులు సలహా ఇస్తున్నారట. ఖాళీగా ఉన్నామని ఏదో పాత్ర ఒప్పుకోవద్దు. కక్కుర్తికు పోతే మొత్తం పోతుంది. అలాగే రీఎంట్రీ విషయంలో కంగారు వద్దని చెప్తున్నారట.

 అందుకే స్వాతి ఆచి తూచి అడుగులు వేయాలనుకుంటోంది. తనకెలాగో స్టార్స్ సినిమాల్లో వేషాలు రావు. అలాంటప్పుడు చక్కటి వెబ్ సీరిస్ లు, యంగ్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేయాలనుకుంటోందిట. హీరోయిన్ గా ఎవరైనా తీసుకుంటే ఇంకా హ్యాపీస్. అయితే ఇప్పుడు అంత ధైర్యం చేసే దెవరు. ఆ ఆఫర్ వచ్చేదాకా ఖాళీగా ఉండటం ఎందుకు...అందుకే హైదరాబాద్ తన తల్లి తండ్రుల దగ్గరకు వచ్చిన ఆమె ఇప్పుడు ఓ వెబ్ సీరిస్ కమిటైందని సమాచారం. అంటే త్వరలోనే ఆమె రీఎంట్రీ ఇవ్వనుందన్నమాట. అది క్లిక్ అయ్యిందా మళ్లీ కలర్స్ స్వాతి హవా మొదలవుతుంది. అప్పుడు మళ్లీ సినిమాలు చేస్తుంది.

మాటీవీలో ప్రసారమైన  'కలర్స్' అనే కార్యక్రమం ద్వారా పరిచయమై అదే పేరుతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కలర్స్ స్వాతి అతి తక్కువ కాలంలోనే తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకుంది. తొలుత డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఆ తర్వాత సింగర్‌గా, పిమ్మట హీరోయిన్‌గా మారిన ఆమె ఆ మధ్యన వివాహం చేసుకుని  శ్రీమతిగా మారింది.మలేసియన్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్‌ వికాస్‌తో ఆమె వైవాహిక జీవితం హ్యాపీగా ఉంది. వివాహానంతరం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.   

 కలర్స్ స్వాతికు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో మార్కెట్ ఉంది.  స్వాతి కృష్ణవంశీ దర్శకత్వంలో డేంజర్ సినిమాలో నటించింది. 2008లో ఆమె నటించిన అష్టా చెమ్మా చిత్రం సక్సెస్ కావడంతో ఆమెను వెతుక్కుంటూ హీరోయిన్ ఆఫర్లు వచ్చాయి. 2008లో ఈ సినిమాకు ఆమెకు నంది పురస్కారం లభించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios