Asianet News TeluguAsianet News Telugu

కలర్స్ స్వాతి రీఎంట్రీ ఫిల్మ్ ..భలే డిఫరెంట్

  పెళ్లిచేసుకుని, విదేశాలకు వెళ్లిపోయింది. మళ్లీ తరువాత ఎప్పుడో ఓసారి టీవీలో కనిపించడం తప్ప సినిమాల్లోకి రాలేదు. అయితే మళ్లీ సినిమాలు చేసినా చేయలేదు కానీ ఇప్పుడో ఓ సినిమా చేసింది. ఆ సినిమానే పంచతంత్రం.  

Colors Swathi makes comeback with Panchathantram jsp
Author
Hyderabad, First Published Apr 22, 2021, 1:56 PM IST

కలర్స్ స్వాతి ఒక టైమ్ లో చాలా మందికి ఆల్ టైమ్ ఫేవరెట్ లా ఫిక్సైపోయింది. కలర్స్ పోగ్రామ్ తో  అటు టీవీలోనూ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.అక్కడా అతి తక్కువ టైమ్ లో  సంచలనం సృష్టించి, ఆ తర్వాత  పెళ్లిచేసుకుని, విదేశాలకు వెళ్లిపోయింది. మళ్లీ తరువాత ఎప్పుడో ఓసారి టీవీలో కనిపించడం తప్ప సినిమాల్లోకి రాలేదు. అయితే మళ్లీ సినిమాలు చేసినా చేయలేదు కానీ ఇప్పుడో ఓ సినిమా చేసింది. ఆ సినిమానే పంచతంత్రం.  

‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా ఓ సినిమా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి 'పంచతంత్రం' టైటిల్ ఖరారు చేశారు. గురువారం ఉదయం అడివి శేష్  టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. సినిమాలో నటీనటుల వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా నిర్మాత సృజన్‌ ఎరబోలు మాట్లాడుతూ "బ్రహ్మానందంగారు, 'కలర్స్' స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, సముద్రఖని, రాహుల్‌ విజయ్‌, నరేష్‌ అగస్త్య సినిమాలో నటిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం శివాత్మిక ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. 'కలర్‌ ఫొటో'తో ప్రేక్షకులతో పాటు పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు సందీప్‌ రాజ్‌ మా చిత్రానికి మాటలు రాయడం సంతోషంగా ఉంది. అలాగే, వరుస విజయాల్లో ఉన్న సంగీత దర్శకుడు ప్రశాంత్‌ ఆర్‌. విహారి సంగీతం అందిస్తున్నారు’’ అని అన్నారు.

ఈ చిత్రంతో రచయితగా, దర్శకుడిగా పరిచయమవుతున్న హర్ష పులిపాక మాట్లాడుతూ ‘‘ప్రతి జీవికి అవసరమైన పంచేంద్రియాలు – చూపు, వినికిడి, రుచి, స్పర్శ, వాసన... ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. ఐదు భావేద్వేగాల మిళితమైన చక్కటి కథ ఇది. యువతరం ఆలోచనలు, వాళ్ల దృక్పథాలకు అద్దం పట్టేలా కథ, కథనాలు ఉంటాయి" అని అన్నారు.

నటీనటులు:
‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, సముద్రఖని,  స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ ‌ తదితరులు.

సాంకేతిక వర్గం:
పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్‌ – ఫణి కందుకూరి (బియాండ్‌ మీడియా)
అసోసియేట్ డైరెక్టర్: విక్రమ్
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అయేషా మరియమ్‌
ఎడిటర్‌: గ్యారీ బీహెచ్‌
సినిమాటోగ్రఫీ: రాజ్‌ కె. నల్లి
ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సాయి బాబు వాసిరెడ్డి  
లైన్ ప్రొడ్యూసర్: సునీత్ పడోల్కర్  
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భువన్‌ సాలూరు
క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: ఉషారెడ్డి వవ్వేటి  
మాటలు: హర్ష పులిపాక – ‘కలర్‌ ఫొటో’ సందీప్‌ రాజ్‌
పాటలు: కిట్టు విస్సాప్రగడ
సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి
సహ నిర్మాతలు: రమేష్ వీరగంధం, రవళి కలంగి
నిర్మాతలు: అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు
రైటర్‌–డైరెక్టర్‌: హర్ష పులిపాక

Follow Us:
Download App:
  • android
  • ios