మాటీవీలో ప్రసారమైన  'కలర్స్' అనే కార్యక్రమం ద్వారా పరిచయమై అదే పేరుతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కలర్స్ స్వాతి అతి తక్కువ కాలంలోనే తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకుంది. తొలుత డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఆ తర్వాత సింగర్‌గా, పిమ్మట హీరోయిన్‌గా మారిన ఆమె ఆ మధ్యన వివాహం చేసుకుని  శ్రీమతిగా మారింది.మలేసియన్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్‌ వికాస్‌తో ఆమె వైవాహిక జీవితం హ్యాపీగా ఉంది.

వివాహానంతరం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.  అయితే ఆమె ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోందని వినికిడి. కలర్స్ స్వాతి తన ఆల్ టైమ్ హిట్ కార్తికేయ చిత్రానికి సీక్వెల్ లో నటించనుంది. ఈ మేరకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచాతరం. ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉన్నా..స్వాతి పాత్ర కీలకంగా కథలో ప్రాధాన్యత కలిగి ఉంటుందని తెలుస్తోంది. దర్శకుడు చందు మొండేటి ఈ మేరకు ఇప్పటికే కథ పూర్తి చేసి షూటింగ్ కు రెడీ గా ఉన్నారు. 

పీపుల్స్ మీడియా ప్యాక్టరీపై టిజి విశ్వప్రసాద్  ఈ సినిమాను నిర్మించనున్నారట. అయితే ప్రస్తుతం నిఖిల్ అర్జున్ సురవరం రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు. దాంతో అవన్నీ పూర్తి అయ్యాక   ఈ సీక్వెల్ ను పట్టాలెక్కించాలన్న ప్లాన్ లో ఉన్నారట. చందు గత ఏడాది తెరకెక్కించిన సవ్యసాచి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈసారి ఎలాగైనా  మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాలని చూస్తున్నారు. 

ఇక కలర్స్ స్వాతి తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో మార్కెట్ ఉంది.  స్వాతి కృష్ణవంశీ దర్శకత్వంలో డేంజర్ సినిమాలో నటించింది. 2008లో ఆమె నటించిన అష్టా చెమ్మా చిత్రం సక్సెస్ కావడంతో ఆమెను వెతుక్కుంటూ హీరోయిన్ ఆఫర్లు వచ్చాయి. 2008లో ఈ సినిమాకు ఆమెకు నంది పురస్కారం లభించింది.