ఆర్ఆర్ఆర్ తో పాటు 95 అకాడమీ అవార్డ్స్ లో సత్తా చాటిన మరో చిత్రం 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'. డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింగా రూపొందిన ఈ చిత్రం ఆ కేటగిరిలో ఆస్కార్ సాధించింది.
ఆర్ఆర్ఆర్ తో పాటు 95 అకాడమీ అవార్డ్స్ లో సత్తా చాటిన మరో చిత్రం 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'. డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింగా రూపొందిన ఈ చిత్రం ఆ కేటగిరిలో ఆస్కార్ సాధించింది. ఈ చిత్రాన్ని మహిళా దర్శకురాలు కార్తీకి కార్తీకి గోన్సల్వేస్ తెరకెక్కించారు. దీనితో ఆమెపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.
కార్తీకి తమిళనాడుకి చెందిన దర్శకురాలు. తల్లి ఏనుగు మరణించడంతో.. రఘు అనే పిల్ల ఏనుగు భాద్యతని బొమ్మన్, బెల్లి అనే ట్రైబల్ జాతి దంపతులు తీసుకుంటారు. ఆయా ఏనుగు పిల్లతో వాళ్ళిద్దరికీ బంధం ఎలా ఏర్పడింది. కొంత కాలం తర్వాత ఆ ఏనుగు పిల్ల రఘుకి దూరం కావలసి వస్తే ఏంటి భావోద్వేగాలు చోటు చేసుకున్నాయి అనే రియల్ ఇన్సిడెంట్ ని కార్తీకి ఎంతో అద్భుతంగా 41 నిమిషాలు డాక్యుమెంటరీ చిత్రంలో చూపించారు.

ఆమె గతంలో యానిమల్ ప్లానెట్ లాంటి ఛానల్స్ తో కెమెరా ఆపరేటర్ గా పనిచేసిన అనుభవం ఈ చిత్రానికి ఉపయోగపడింది. యానిమల్స్ కదలికలు ఆమెకి బాగా తెలుసు. అలాగే తమిళనాడుకి చెందిన మహిళ కావడంతో అక్కడి ట్రైబల్ జాతుల గురించి కూడా ఆమెకి తెలుసు. ఇప్పుడు ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రం ఆస్కార్ సాధించడంతో బొమ్మన్, బెల్లి కూడా ఫేమస్ అయ్యారు.
తాజాగా ఈ దంపతులని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సత్కరించారు. అంతే కాదు ఇద్దరికీ చెరొక రూ లక్ష బహుమతిగా నటించారు. దీనిపట్ల కార్తీకి సోషల్ మీడియాలో స్పందిస్తూ తన సంతోషాన్ని తెలియజేశారు. మా ముఖ్యమంత్రి స్టాలిన్ గారు బొమ్మన్, బెల్లిని సన్మానించడం చాలా సంతోషంగా ఉంది అని ట్వీట్ చేశారు.
తమిళనాడుకు చెందిన మహిళా కార్తీకి తొలి భారతీయ మహిళగా ఆస్కార్ అవార్డు సాధించింది. ఇంతకి మించిన సంతోషం లేదు అంటూ ఇప్పటికే సీఎం స్టాలిన్ ఎలిఫెంట్ విస్పరర్స్ టీంని అభినందించారు.
