భారీ అంచనాల నడుమ ప్రేక్షుకుల ముందుకు వచ్చిన సాహో చిత్రంలో భారీ తారాగణం నటించింది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది. జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, ఎవిలిన్ శర్మ, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్ లాంటి ప్రముఖ నటులంతా ఈ చిత్రంలో నటించారు. 

ఇక హాట్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్ చేసిన స్పెషల్ సాంగ్ అయితే కుర్రకారుని ఒక ఊపు ఊపింది. బ్యాడ్ బాయ్ అంటూ సాగే పాటలో జాక్వెలిన్ అందాలు ఆరబోసింది. మొదటి ఈ సాంగ్ కోసం కాజల్ అగర్వాల్ ని చిత్ర యూనిట్ సంప్రదించిందని.. ఆ తర్వాత జాక్వెలిన్ ని ఎంచుకుందని వార్తలు వచ్చాయి. 

దీనితో తనని కాదని జాక్వెలిన్ ని ఎంచుకోవడంతో ప్రభాస్ పై కాజల్ మనస్తాపానికి గురైందని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని సమాచారం. కేవలం జాక్వెలిన్ కు పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ ఉండడంతో ఆమెని ఎంపిక చేసుకున్నారట. ఇది చిత్ర యూనిట్ కలసి తీసుకున్న నిర్ణయమే అని.. జాక్వెలిన్ కు ముందుగా మరెవరిని సంప్రదించలేదని అంటున్నారు.