ఈ సినిమా పాన్ ఇండియా మూవీ అని, రెండు భాగాలుగా వస్తుందని కూడా కొందరు రాసుకొచ్చారు. ఈ క్రమంలో తాజా వార్తలపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది.
ఈ సోషల్ మీడియా రోజుల్లో ఏ వార్త నిజమో..ఏది కాదో తెలియని పరిస్దితి నెలకొంది. రకరకాల కాంబినేషన్స్ తో వార్తలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. కొన్ని వింటూంటే నిజమే అనిపిస్తాయి. అయితే ఆ మేకర్స్ తర్వాత అబ్బే అలాంటి ప్రాజెక్టే మేము అనుకోలేదని ప్రకటిస్తారు. అప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్న ఫ్యాన్స్ నాలుక కరుచుకుంటారు. అలాంటిదే ఇప్పుడు ఒకటి చోటు చేసుకుంది.
ఎన్టీఆర్ , ధనుష్ హీరోగా తమిళ దర్శకుడు వెట్రిమారన్ ఓ పాన్ ఇండియా మూవీని చేస్తున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు మీడియాలో మొదలయ్యాయి. గత రెండు రోజులుగా సోషల్‌మీడియాలో ఈ వార్త జోరు అందుకుని ఏకంగా ట్రెండింగ్ లో నిలబడింది. అఫీషియల్ గా ప్రకటించడమే తరువాయి అంటూ అనేక వెబ్‌సైట్‌లు సైతం రాసుకొస్తున్నాయి. ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీ అని, రెండు భాగాలుగా వస్తుందని కూడా కొందరు రాసుకొచ్చారు. ఈ క్రమంలో తాజా వార్తలపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. అవన్నీ ఆధారాల్లేని వార్తలని, అవాస్తవాలని స్పష్టం చేసి షాక్ ఇచ్చింది. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేశారు.
‘‘ఎన్టీఆర్, ధనుష్, వెట్రిమారన్‌లు కలిసి సినిమా చేస్తున్నారని, గత రెండు, మూడు రోజులుగా కొన్ని అనధికార వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఆ వార్తలన్నీ అవాస్తవం. దయచేసి ఆ ఊహాగానాలను నమ్మొద్దు’’ అని పేర్కొంది.
వాస్తవానికి గతేడాదే ఎన్టీఆర్ ను హైదరాబాద్ లో కలిసాడు వెట్రిమారన్. దీంతో వీరి కాంబినేషన్ లో చిత్రం అనగానే నిజమే అనుకున్నారంతా. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఇప్పుడు క్లారిటీ వచ్చినట్లైంది.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. జాన్వీకపూర్ హీరోియన్. ‘NTR30’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాతోనే జాన్వీ తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డుల వేడుకలో పాల్గొనేందుకు లాస్ ఏంజిల్స్ వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొరటాల మూవీ షూటింగ్ పాల్గొంటారు. దీని తర్వాత ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో ఓ మూవీని చేస్తారు. పాన్ ఇండియా మూవీగా ఇది తెరకెక్కనుంది.
మరోవైపు విజయ్‌సేతుపతితో వెట్రిమారన్ ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత సూర్యతో ‘వాడివసల్’ చేస్తారు. ఇక ధనుష్ ఇటీవల ‘సార్’తో మంచి విజయాన్ని అందుకోగా, ప్రస్తుతం అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ‘కెప్టెన్ మిల్లర్’ మూవీ చేస్తుండగా, దీని తర్వాత శేఖర్ కమ్ములతో ఓ సినిమా చేయనున్నారు.
