మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న వాల్మీకి సినిమా షూటింగ్ లో ఒక స్పెషల్ సెలబ్రెటీ దర్శనమిచ్చారు. వరల్డ్ లో ది బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ లో ఒకరైన రిచర్డ్ సన్ హరి శంకర్ తో కలిసి ఒక షాట్ ను చిత్రీకరించారు కూడా. వాల్మీకి సెట్ లో సందడి చేస్తూ చిత్ర యూనిట్ సభ్యులను హ్యాపీగా పలకరించారు. 

రిచర్డ్ సన్ మూడు సార్లు ఆస్కార్ బరిలో విజేతగా నిలిచాడు.  జె ఎఫ్ కె(1991),ది ఏవియేటర్(2004), హ్యూగో(2011) వంటి సినిమాలకు పని చేసిన ఆయన అందరూ ఊహించినట్టుగానే బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా ఆస్కార్స్ అందుకున్నారు. ఇక అలాంటి ప్రముఖ టెక్నీషియన్ వాల్మీకి షూటింగ్ లో పాల్గొనడం హ్యాపీగా ఉందని దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. 

ఇక వాల్మీకి సినిమాలో హీరో వరుణ్ తేజ్ సరికొత్త మాస్ లుక్ లో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే మాస్ ఆడియెన్స్ లో అంచనాలు రేపాడు. తమిళ్ సినిమా జిగర్తాండకు ఈ సినిమా రీమేక్. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ్ హీరో అథర్వ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.