సినిమా ఇండస్ట్రీలో పని చేసే చాలా మందికి డైరెక్టర్ కావాలనే కల ఉంటుంది. ఇతర విభాగాల్లో పని చేసినప్పటికీ డైరెక్టర్ గా కూడా పని చేయాలని అనుకుంటూ ఉంటారు. సినిమాల మేకింగ్ విషయంలో కీలకపాత్ర పోషించే కెమెరామెన్స్ చాలా మంది మెగా ఫోన్ పట్టిన సందర్భాలు ఉన్నాయి.

సౌత్ సినిమాల్లో టాప్ సినిమాటోగ్రాఫర్ గా వెలుగొందుతోన్న రత్నవేలుకి కూడా డైరెక్షన్ కల ఉందట. ఎన్నో ఏళ్ల ముందే దీనికి సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయి. ఏడేళ్ల క్రితమే రత్నవేలు డైరెక్టర్ గా మారాల్సిందట. కానీ కొన్ని కారణాల వలన అది సాధ్యం కాలేదని.. త్వరలోనే దర్శకుడిగా మరతానని చెబుతున్నాడు.

డైరెక్టర్ గా తను సినిమా చేయాలనుకున్న సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ పిలిచి రోబో సినిమా చేయామన్నారట. దీంతో అంత పెద్ద ప్రాజెక్ట్ వదులుకోలేక తను డైరెక్షన్ చేయాలనుకున్నసినిమాను వాయిదా వేసినట్లు.. ఆ తరువాత 'రంగస్థలం' సినిమా తరువాత కచ్చితంగా డైరెక్ట్ చేయాల్సిందేనని ఫిక్స్ అయ్యానని.. కానీ రామ్ చరణ్ తనను ఆపేసినట్లు తెలిపారు.

సినిమాటోగ్రాఫర్ గా టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఇండస్ట్రీకి తన అవసరం ఉంటుందని.. ఇలాంటి సమయంలో డైరెక్షన్ చేయొద్దని చెప్పాడట. ఇంతలో 'సై రా' సినిమాకి పని చేసే ఛాన్స్ రావడంతో ఆగానని చెప్పుకొచ్చాడు రత్నవేలు.