కేరళా విమాన ప్రమాదంపై సినీ తారలు స్పందిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినీ స్టార్స్ కమల్‌ హాసన్‌, మహేష్‌బాబు, అల్లు అర్జున్, షారూఖ్‌ ఖాన్‌,  అక్షయ్‌ కుమార్‌ వంటి వారు స్పందించి విచారం వ్యక్తం చేస్తున్నారు. 

కేరళలోని కోజికోడ్‌ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశ ప్రజానికాన్ని కలచివేస్తుంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 19 మంది మృతి చెందగా, 171 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 23 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై సినీ తారలు స్పందిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సినీ స్టార్స్ కమల్‌ హాసన్‌, మహేష్‌బాబు, అల్లు అర్జున్, షారూఖ్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌ వంటి వారు స్పందించి విచారం వ్యక్తం చేస్తున్నారు. విశ్వనటుడు కమల్‌ హాసన్‌ ట్విట్టర్‌ ద్వారా సంతాపం తెలిపారు. కోజికోడ్‌ ప్రమాదంలో చనిపోయిన వారికి నా సంతాపం. వారి కుటుంబాలను నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. కోలుకుంటున్న వారికి నా శుభాకాంక్షలు. కాలికట్‌ పౌరులకు, విమానాశ్రయం సిబ్బందికి నమస్కరిస్తున్నా. అదే సమయంలో ఇప్పటికే పోరాడుతున్న వైద్య సిబ్బందికి మరింత బలాన్ని అందించాలని కోరుకుంటున్నా` అని ట్వీట్‌ చేశారు.

Scroll to load tweet…

మహేష్‌బాబు స్పందిస్తూ, కోజికోడ్‌ ఎయిర్‌ క్రాష్‌ వార్త విని తీవ్రంగా బాధపడ్డాను. దురదృష్టకర సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, స్నేహితులకు నా సంతాపం తెలియజేస్తున్నా, గాయపడిన వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా` అని ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. 

Scroll to load tweet…

ఇక కేరళా ప్రజలు మల్లు స్టార్‌గా పిలుచుకునే అల్లు అర్జున్‌ స్పందిస్తూ, విమాన ప్రమాదం చాలా విషాదం. కోజికోడ్‌లో ఇలాంటివి చూస్తే కచ్చితంగా షాక్‌ అవుతారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి నా సంతాపం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. గాయపడిన వారు సురక్షితంగా బయటపడాలని, వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా` అని విచారం వ్యక్తం చేశారు. 

Scroll to load tweet…

అక్షయ్‌ కుమార్‌ ట్వీట్‌ చేస్తూ, ఇది చాలా భయంకరమైన వార్త. గుండె తరించుకుపోతుంది. ఎయిర్‌ ఇండియా ఎక్స్ ప్రెస్‌ విమాన ప్రయాణికులు, సిబ్బంది భద్రతకోసం ప్రార్థిస్తున్నా. మృతులకు తీవ్ర సంతాపం తెలుపుకుంటున్నా` అని అన్నారు. 

Scroll to load tweet…

బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ, విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు, సిబ్బంది కోసం నా గుండె ఆవేదన చెందుతుంది. ఇష్టమైన వారిని కోల్పోయి గుండెకోతని అనుభవిస్తున్న కుటుంబాలను నా ప్రగాఢ సానుభూతిని, మృతులకు సంతాపాన్ని తెలియజేస్తున్నా. వారి కోసం ప్రార్థనలు చేస్తున్నా` అని ట్వీట్‌ చేశారు. 

Scroll to load tweet…