కొత్త తరహా కథతో తెరకెక్కుతున్న సినీ మహల్ ప్రత్యేక అతిధి పాత్రలో సలోని మార్చిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న యూనిట్

కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో సిద్ధాంశ్, రేయాన్ రాహుల్, తేజస్విని హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం `సినీ మహల్`. రోజుకు 4 ఆటలు ఉపశీర్షిక. లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో బి.రమేష్ నిర్మాతగా, పార్థు, బాలాజీ, మురళీధర్ , మహేంద్ర సహనిర్మాతలుగా ఈ చిత్రం తెరెక్కెక్కింది. ఈ సినిమా సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని మార్చిలో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా...

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ‘’మా సినీ మ‌హ‌ల్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమా చాలా బాగా వచ్చింది. కొత్త తరహాలో సాగే కథనంతో ఆద్యంతం ఆకట్టుకునే చిత్రమిది. డైరెక్ట‌ర్ లక్ష్మణ్ వర్మ చక్కగా తెరకెక్కించారు. సిద్ధాంశ్, రాహుల్, తేజస్విని బాగా నటించారు. ముఖ్యంగా సలోనిగారు చేసిన స్పెషల్ సాంగ్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ష‌క‌ల‌క శంక‌ర్ కామెడి, శేఖ‌ర్ చంద్ర సంగీతం, దొరై సి.వెంక‌ట్ సినిమాటోగ్ర‌ఫీ, ప్రవీణ్‌పూడి ఎడిటింగ్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. సినిమాను మార్చి నెలలో విడుదల చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

గొల్లపూడి మారుతీరావు, జీవా, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈచిత్రానికి సినిమాటోగ్రఫీ: దొరై కె.సి.వెంకట్, సంగీతం: శేఖర్ చంద్ర, ఎడిటర్: ప్రవీణ్ పూడి, కళ: గోవింద్, ఎఫెక్ట్స్: యతిరాజ్, లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ, కృష్ణచైతన్య, నాగహనుమాన్, సహనిర్మాతలు: పార్ధు, బాలాజీ, మురళీధర్, మహేంద్ర, నిర్మాత: బి.రమేష్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: లక్ష్మణ్ వర్మ.