సారాంశం

బుల్లితెరపై సూపర్ సక్సెస్ సాధించి ప్రేక్షకుల మనసులు దోచిన సిరియల్ సీఐడి. ఈ సీరియల్ లో నటించిన ఓ ఫేమస్ నటుడు ప్రస్తుతం హాస్పిటల పాలు అయ్యాడు. ఇంతకీ ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది..? 
 

టెలివిజన్ చరిత్రలో సంచలనం సృష్టించిన సీరియల్ అంటే ముందు వరసలో CID ఉంటుంది.  బుల్లితెర పై లాంగ్ టైమ్ ప్లే అయిన సీరియల్ కూడా CIDనే.  విశేష ప్రజాదరణ  ఆదరణ పొందిన సీరియల్ ఏదీ అంటే ఠక్కున CID పేరు వస్తుందతి. అలా ఆడియన్స్ ను అరిస్తూ వచ్చిన ఈసీరియల్ హిందీతో పాటు.. తెలుగులో కూడా ఈసీరియల్ కు మంచి ఆదరణ ఉంది.  అంతలా ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసిన క్రైమ్ అండ్ సస్పెన్షనల్ టీవీ సిరీస్ సీఐడీ. మరీ ముఖ్యంగా  చిన్న పిల్లలకు ఇదిఫ్యావరేట్  సీరియల్.

ఇక ఈ సీరియల్ నటించిన ఆఫీసర్లంతా CIDతెనే ఎంత పాపులర్ నటులుగా మారారు. . తాజాగా ఈ సీరియల్ నటించిన ఓ నటుడు తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రి పాలైయ్యాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..దాదాపు 20 ఏళ్ల పాటు తిరుగులేని సీరియల్‌గా పేరుపొందిన ‘CID’లో కామెడీ పోలీసు అధికారిగా ఫ్రెడరిక్స్ పాత్రలో కనిపించిన నటుడు దినేష్ ఫడ్నిస్. ఆయన రీసెంట్ గా  గుండెపోటుకు గురయ్యారు. డిసెంబరు 1న ఆయనకు గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే వెంటనే గుర్తించిన ఫ్యామిలీ మెంబర్స్..  ముంబైలోని తుంగా ఆసుపత్రికి తరలించారు. గత రెండు రోజులుగా ఆయనకు వెంటిలేటర్ ఉన్నారు. అత్యవసర చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ఇక  ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

జాన్వీ కపూర్ హోమ్ టూర్

ఈ విషయం తెలుసుకున్న CID ఫేమ్ నటులు.. ఆసుపత్రికి చేరుకుని  దినేష్ కు సపోర్ట్ గా నిలబడ్డారు. ఆయన ఫ్యామిలీని ఓదార్చడంతో పాటు.. ట్రీట్మెంట్ ను పరిశీలిస్తున్నారు.  సీఐడీలో దయా పాత్రను పోషించిన దయానంద్ శెట్టి, దినేష్ ఆరోగ్యం గురించి లెటెస్ట్ అప్‌డేట్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. దినేష్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుందని అన్నారు. దినేష్ శరీరం చికిత్సకు స్పందిస్తుందని.. దినేష్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని అన్నారు.