Asianet News TeluguAsianet News Telugu

Janhvi Kapoor: జాన్వీ కపూర్ హోమ్ టూర్.. ఫస్ట్ టైమ్ తన ఇంటిని చూపిన బ్యూటీ, వైరల్ వీడియో

దేవర సినిమాతో సౌత్ ఎంట్రీ ఇవ్వబోతోంది జాన్వీ కపూర్. బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సాధించింది. ఇక తాజాగా జాన్వీ.. తన హోమ్ టూర్ వీడియో చేసింది.  

Bollywood Beauty Janhvi Kapoor Home Tour Video Viral JmS
Author
First Published Dec 4, 2023, 8:44 AM IST

శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్...  దఢక్ సినిమాతో తెరంగేట్రం చేసి.. సూపర్ హిట్ అందుకుంది. కమర్షియల్ సినిమాలకు దూరంగా .. డిఫరెంట్ కథలను సెలక్ట్ చేసుకుంటూ.. హీరోయిన్ గా సెట్ అయ్యింది జాన్వీ కపూర్. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో స్టార్ డమ్ అందుకుంది. అంతే కాదు కెరీర్ బిగినింగ్ లోనే  లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో నటిగా నిరూపించుకుంది. ఒక రకంగా సాహసం చేసింది బ్యూటీ. 

హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు తెలుగు లో పక్కా కమర్షియల్ సినిమాతో  పరిచయం కాబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు రాబోతుంది జాన్వీ. సౌత్ ఇండస్ట్రీలో ఆమె నటిస్తోన్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మత్స్యకారుల కుటుంబానికి చెందిన  అమ్మాయిగా కనిపించనుంది. అలాగే ఇందులో జాన్వీ పాత్రకు యాక్షన్ సీన్స్ ఉంటాయని టాక్ వినిపిస్తుంది. 

CID : సీఐడీ నటుడికి గుండెపోటు.. ఐసీయూలో దినేష్ ఫడ్నిస్ ..

ఇక దేవర సినిమాతో సౌత్ లో బిజీ కాబోతోంది జాన్వీ. షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది బ్యూటీ. తన విషయాలు పంచుకోవడమే కాదు..హాట్ పోటోషూట్లతో సందడి చేస్తుంటుంది. ఇక తాజాగా ఈఅమ్మడు ముంబైలోని తన ఇంటిని అభిమానులకు చూపించింది.

 

ముంబైలోని తన విలాసవంతమైన ఇంటిని చూపిస్తూ ఓ వీడియో షేర్ చేసింది జాన్వీ.  జాన్వీ పంచుకున్న వీడియోలో కనిపిస్తున్న ఇల్లు అచ్చం రాజభవనం మాదిరిగానే ఉంది. వైట్, హ్యాష్ కలర్ పెయింటింగ్స్, విలాసవంతంగా.. క్లాసీగా కనిపిస్తుంది. జాన్వీతోపాటు బోనీ కపూర్, ఖుషీ కపూర్ సరదాగా గడిపిన క్షణాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జాన్వీ షేర్ చేసిన హోమ్ టూర్ వీడియో నెట్టింట వైరలవుతుంది.
ఈ ఇంట్లో  పార్టీస్ చేసుకోవడానికి ఖాళీ ప్రదేశం ఉంది. తనకు ఇల్లు, ఏఆర్ రెహమాన్ సంగీతం చాలా ఇష్టమని తెలిపిందే. ఆ ఇంట్లో తన తల్లి శ్రీదేవితో గడిపిన జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపింది. అలాగే తన తల్లిదండ్రులు శ్రీదేవి, బోనీ కపూర్ లతో ఎంతో సరదాగా గడిపేవాళ్లమని చెప్పుకొచ్చింది. తన తల్లి మరణించిన తర్వాత తన తండ్రి, చెల్లితో కలిసి ఆ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండలేకపోయానని.. అందుకు కారణం తన తల్లి జ్ఞాపకాలు నిత్యం గుర్తొస్తాయంటూ ఎమోషనల్ అయ్యింది జాన్వీ. శ్రీదేవి మరణం తర్వాత బోనీ కపూర్ తన కూతుర్లతో కలిసి మరో ఇంటికి వెళ్లిపోయారు.ఇక జాన్వీ బాలీవుడ్ లో  నితేష్ తివారీ డైరెక్షన్ లో బవాల్ మూవీలో కనిపించింది. ప్రస్తుతం దేవర సినిమాతో పాటు మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాలు చేస్తుంది బ్యూటీ. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios