రెండో ప్రపంచయుద్ద సమయంలో అణుబాంబును తయారు చేయడానికి ఓపెన్ హైమర్ ఎలాంటి ప్రయోగాలు చేశాడు?
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) దర్శకత్వంలో తాజాగా వచ్చిన చిత్రం ‘ఓపెన్ హైమర్’ (Oppenheimer). అణుబాంబును కనిపెట్టిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇక ఈ ఏడాది జులై 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం ఇండియాలో ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన ఎనిమిది నెలల తర్వాత ఓటీటీ ఆడియెన్స్ ముందుకు ఈ హాలీవుడ్ మూవీ రాబోతోంది.
మార్చి 21 నుంచి జియో సినిమా ఓటీటీలో ఓపెన్‌హైమర్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ హాలీవుడ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను జియో సినిమా అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. అయితే ప్రీమియర్ కస్టమర్స్ మాత్రమే ఓపెన్‌హైమర్ మూవీని జియో సినిమా ఓటీటీలో చూడవచ్చు. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో ఓపెన్‌హైమర్ స్ట్రీమింగ్ ఉండబోతున్నట్లు తెలిసింది. 96వ ఆస్కార్ అవార్డ్స్‌లో అత్యధిక నామినేషన్స్ దక్కించుకున్న మూవీగా ఓపెన్ హైమర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు కనీసం పది వరకు ఆస్కార్ అవార్డులు దక్కే అవకాశం ఉందని హాలీవుడ్ సినీ వర్గాలు చెబుతోన్నాయి. మార్చి 11న ఆస్కార్ అవార్డులను ప్రకటించనున్నారు.
ఆ మధ్యన 2024 ఆస్కార్ అవార్డుల కోసం వివిధ కేటగిరీల్లో పోటీ పడే చిత్రాల జాబితాను (Oscar Nominations 2024) అకాడమీ ప్రకటించింది. అందరూ ఊహించినట్టుగానే ఈసారి ఆస్కార్ అవార్డుల్లో సత్తా చాటేందుకు ఓపెన్‌హైమర్ చిత్రం సిద్ధమైంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఎడిటింగ్, బెస్ట్ బీజీఎం.. ఇలా దాదాపు 13 విభాగాల్లో పోటీలో నిలిచింది. ఓపెన్‌హైమర్ తర్వాత రెండో స్థానంలో పూర్ థింగ్స్ నిలిచింది. ఈ సినిమా 11 విభాగాల్లో నామినేట్ అయ్యింది. మూడో స్థానంలో నిలిచిన కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ సినిమా 10 విభాగాల్లో నామినేషన్స్‌లో నిలిచింది. ఇక గత ఏడాది సెన్సేషనల్ మూవీగా నిలిచిన బార్బీ కూడా ఆరు విభాగాల్లో నామినేట్ అయ్యింది. ఖచ్చితంగా 'ఓపెన్‌హైమర్' కు అవార్డ్ ల పంట పండుతుందని భావిస్తున్నారు. ఇది నోలన్ అభిమానులను ఆనందాల్లో ముంచెత్తుతోంది.
నోలన్ మాట్లాడుతూ...“ఈ స్దాయి విజయాన్ని మేము ఊహించలేదు. అయితే గొప్ప కథపై మాకు గొప్ప నమ్మకం అయితే ఉంది. ఇది కథ బలం. అమెరికన్ చరిత్రలోని కొన్ని భాగాలు మమ్మల్ని లీడ్ చేసాయి. వేసవిలో వచ్చిన ఈ సినిమా అకాడమి చేత గుర్తింపబడుతుందని భావిస్తున్నాను. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు ఇది మేము ఊహించింది అయితే కాదు, ఇది వండ్రఫుల్ సర్పైజ్ అనే చెప్పాలి. .”
ఇక హాలీవుడ్ రీసెంట్ బ్లాక్‌బస్టర్ ‘ఓపెన్‌హైమర్’. క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు. శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ (Robert J Oppenheimer) జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకుంది. అణు బాంబును కనుగొన్న శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా చేసుకుని ‘ఓపెన్ హైమర్’ను రూపొందించారు.
క్రితం సంవత్సరం 2023 జులై 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. 100 మిలియన్ డాలర్లతో దీనిని నిర్మించగా.. 950 మిలియన్ డాలర్లు వసూళ్లు చేసినట్లు సినీ విశ్లేషకుల అంచనా. ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దినప్పటికీ భగవద్గీతకు సంబంధించి చిత్రీకరించిన ఓ సన్నివేశం వివాదాస్పదంగా మారింది. శృంగార సన్నివేశంలో భగవద్గీతను చూపించడాన్ని సినీప్రియులు తప్పుబట్టారు. ఆ సీన్ తొలగించాలని డిమాండ్ చేశారు.