Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ.. ప్రపంచమే ఉలిక్కి పడ్డ కాన్సెప్ట్ తో..

మరే దర్శకుడికి సాధ్యం కానీ విధంగా నోలెన్ ఎంచుకునే కథాంశాలు వైవిధ్యంగా ఉంటాయి. ఒక సైంటిస్ట్ తరహాలో నోలెన్ తాను ఎంచుకున్న కథపై అధ్యయనం చేసి సినిమాలు తెరకెక్కిస్తారు.

Christopher Nolan next movie about World War II scientist J Robert Oppenheimer
Author
Hyderabad, First Published Sep 12, 2021, 9:25 AM IST

ప్రస్తుతం ఇండియాలో హాలీవుడ్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. ఇండియన్ చిత్రాలకు పోటీగా హాలీవుడ్ మూవీస్ కూడా ఇక్కడ వసూళ్లు సాధిస్తున్నారు. మార్వల్ సూపర్ హీరో చిత్రాలే అందుకు ఉదాహరణ. ఇక దిమ్మ తిరిగే కాన్సెప్టు లతో ప్రేక్షకులకే సవాల్ విసిరే దర్శకుడిగా క్రిస్టఫర్ నోలెన్ గుర్తింపు పొందారు. 

మరే దర్శకుడికి సాధ్యం కానీ విధంగా నోలెన్ ఎంచుకునే కథాంశాలు వైవిధ్యంగా ఉంటాయి. ఒక సైంటిస్ట్ తరహాలో నోలెన్ తాను ఎంచుకున్న కథపై అధ్యయనం చేసి సినిమాలు తెరకెక్కిస్తారు. ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లార్, డ్రంకిర్క్, రీసెంట్ గా వచ్చిన టెనెట్ చిత్రాలు ఆయన ప్రతిభకు నిదర్శనాలు. 

టెనెట్ చిత్రం రివర్స్ టైం కాన్సెప్ట్ తో తెరకెక్కింది. మంచి టాక్ అందుకున్నప్పటికీ కరోనా పరిస్థితుల కారణంగా వసూళ్లు సాధించలేకపోయింది. ప్రస్తుతం నోలెన్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. నెక్స్ట్ మూవీ కోసం నోలన్ దిమ్మతిరిగే కాన్సెప్ట్ ని ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

వరల్డ్ వార్ 2 నేపథ్యంలో ఆటం బాంబ్ ని ఎలా తయారు చేశారు అనే స్టోరీ లైన్ ని నోలెన్ ఎంచుకున్నట్లు టాక్. వరల్డ్ వార్ 2లో జపాన్ పై పడ్డ ఆటం బాంబులు ప్రపంచం మొత్తాన్ని గగుర్పాటుకు గురి చేశాయి. 

ఆ టైంలో అసలు ఆటం బాంబ్ ని ఎలా తయారు చేశారు.. ఆటం బాంబ్ సృష్టి కర్త.. ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ అని పిలవబడే సైంటిస్ట్ రాబర్ట్ ఒపెన్‌హీమర్ దీనిపై ఎలా వర్క్ చేశారు అనే కోణంలో నోలన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios