బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రస్తుతం భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. అలియా భట్ ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీ లో నటిస్తూనే బాలీవుడ్ లో 'గంగూబాయి కతీయవాడి' సినిమాలో నటించింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రస్తుతం భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. అలియా భట్ ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీ లో నటిస్తూనే బాలీవుడ్ లో 'గంగూబాయి కతీయవాడి' సినిమాలో నటించింది. లెజెండ్రీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫిబ్రవరి 25న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. దీనితో అలియా భట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. 

ఇక సోషల్ మీడియాలో కూడా గంగూబాయి మానియా కనిపిస్తోంది. అలియా అభిమానులంతా ఆమెని అనుకరిస్తూ గంగూబాయి చిత్రంలోని డైలాగులు చెబుతున్నారు. ఇక కియారా ఖన్నా అనే చిన్నారి సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతోంది. సినిమాల్లోని ఫేమస్ డైలుగులు చెబుతూ, హీరోలని, హీరోయిన్లని అనుకరిస్తూ వైరల్ గా మారుతోంది. 

తాజాగా కియారా ఖన్నా గంగూబాయి చిత్రంలో అలియా భట్ మ్యానరిజమ్స్ దించేసింది. గంగూబాయి టీజర్ లో అలియా చెప్పిన డైలాగులకు లిప్ సింక్ ఇస్తూ అదరగొట్టేసింది. దీనితో నెటిజన్లు కియారా ఖన్నాని చోటా గంగూబాయిగా అభివర్ణిస్తున్నారు. నేలమీద కూర్చుని భలేగా కనిపిస్తున్నావు. అదే అలవాటు చేసుకో.. ఎందుకంటే కుర్చీ పోయిందిగా' అంటూ అలియా భట్ టీజర్ లో చెప్పిన డైలాగులని కియారా ఖన్నా హిందీలో చెప్పింది. 

గతంలో కియారా ఖన్నాని స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా కూడా అభినందించాడు. సిద్దార్థ్ మల్హోత్రా నటించిన షేర్షా చిత్రంలోని డైలాగులపై కూడా చిన్నారి కియారా వీడియో చేసింది. 

View post on Instagram