హీరోగా కొరియోగ్రఫర్ యష్ ఎంట్రీ.. ఏకంగా దిల్ రాజు బ్యానర్ లో సినిమా...
హీరోగా టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు యంగ్ కొరియోగ్రాఫర్ యష్. అంతే కాదు ఏకంగా స్టార్ ప్రొడూసర్ దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు.. వివరాల్లోకి వెళితే...

యంగ్ కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయమవుతున్నాడు. డాన్సర్ గా బుల్లితెరపై దుమ్మురేపిన యష్.. ప్రస్తుతం సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ప్రస్తుతం అతనికి సినిమా చేసే అవకాశం వచ్చింది. యష్ హీరోగా నటిస్తున్న సినిమా ఆకాశం దాటి వస్తావా. కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న యష్ మాస్టర్ ఈ సినిమాతో హీరో మెటీరియల్ అని నిరూపించుకోవాలి అని చూస్తున్నాడు. కార్తీక మురళీధరన్ హీరోయిన్ నటిస్తున్న ఈసినిమాను శశికుమార్ ముత్తులూరి డైరెక్ట్ చేస్తున్నాడు. స్టార్ సింగర్ కార్తీక్ ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈసినిమాను నిర్మాత శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మూవీ టీమ్. కొత్త వాళ్లను ప్రోత్సహించడం కోసం.. కొత్త కంటెంట్‌ను ఆడియన్స్ కు అందించడం కోసం.. దిల్ రాజ్ ప్రొడక్షన్స్అనే నిర్మాణ సంస్థను స్థాపించారు . దిల్ రాజు నిర్మించిన ఈ సంస్థకు ఆయన కూతురు హన్షితా రెడ్డి, అన్న కొడుకు హర్షిత్ రెడ్డి లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
కొత్త వారితో ప్రయోగాలు చేస్తున్నాడు దిల్ రాజు.. ఈ సంస్థ నుంచి వచ్చిన మొదటి సినిమా బలగం. ఈ మూవీ ఎలాంటి హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసంస్థ నుంచి వస్తున్న రెండో సినిమా కావడంతో.. ఈమూవీ ఎలా ఉంటుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. టైటిల్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ‘ఇదొక మ్యూజికల్ మూవీ. కొత్త టాలెంటను పరిచయం చేయాలనే ఈ సంస్థలో శశి,యష్‌లతో ఈ ప్రయత్నం చేస్తున్నాం.
నేటి యువతరాన్ని ఆకట్టుకునే అంశాలతో రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది’ అన్నారు. దర్శకుడు శశి మాట్లాడుతూ జీవితంలో ప్రేమ, టైమ్, డబ్బులకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ మూడింటిలో ఏది తగ్గినా ఆ రిలేషన్‌లో గొడవలు జరుగుతాయి. ఇదే సినిమా నేపథ్యం. కథ వినగానే నిర్మాతకు నచ్చడంతో సినిమా సెట్స్‌పైకి వచ్చింది. ఇదొక మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం’ అన్నారు. తనకు ఇప్పటికి ఇదొక కలలా వుందని హీరో యష్ తెలిపారు.