ప్రముఖ ఛానల్ సోనీలో ప్రసారం అయ్యే ఇండియాస్ బెస్ట్ డాన్సర్ రియాలిటీ షోకు మంచి ఆదరణ ఉంది. దేశవ్యాప్తంగా ఈ షోకు అభిమానులు ఉన్నారు. దేశంలోని బెస్ట్ టాలెంటెడ్ డాన్సర్స్ పాల్గొనే ఈ షోకి మంచి టీఆర్పీ దక్కుతుంది. ఇక ఈ షో న్యాయనిర్ణేతలుగా బాలీవుడ్ ఐటెం బాంబ్ మలైకా అరోరా, గీతా కపూర్, టెరెన్స్ లెవీస్ ఉన్నారు. ఇటీవల మలైకా అరోరా కరోనా బారిన పడ్డారు. దీనితో ఆమె షూటింగ్స్ కి హాజరు కాలేకపోయారు. ఆమె స్థానంలో బాలీవుడ్ నటి  డాన్సర్ అయిన నోరా ఫతేహి ని తీసుకోవడం జరిగింది. 

తాజాగా ప్రసారం అయిన ఎపిసోడ్ లో ఓ అసభ్యకర సంఘటన చోటు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. షోకి జడ్జ్ గా వచ్చిన నోరా ఫతేహిని టెరెన్స్ లెవీస్ తాకకూడని చోట తాకాడట. ఆమె పట్ల అనుచితంగా లారెన్స్ ప్రవర్తించగా ఆ వీడియో ఇదే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నోరా ఫతేహి బటక్స్ లారెన్స్ తాకుతున్నట్లు ఆ వీడియోలో ఉంది.
 
ఈ వీడియో వైరల్ కావడంతో పాటు కొరియోగ్రాఫర్  టెరెన్స్ లెవీస్ పై నెగెటివ్ ప్రచారం ఎక్కువైపోయింది. వేదికపై ఆడవారి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని పలువురు ఆయనను తిట్టిపోస్తున్నారు. దీనితో కొరియోగ్రాఫర్ టెరెన్స్ వివరణ ఇచ్చుకున్నారు. ఆ వీడియో కేవలం మార్పింగి అని, అందులో ఏమాత్రం నిజం లేదని ఆయన చెప్పుకొచ్చారు. నోరాను తను తాక కూడని చోట తాకాను అనడంలో నిజం లేదు అన్నారు. దీనితో అసలు నిజంగా ఏమి జరిగింది అంటే ఆత్రుత అభిమానులలో మొదలైంది.