Asianet News TeluguAsianet News Telugu

Shiva Shankar master:షాకింగ్.. శివశంకర్ మాస్టర్ పరిస్థితి విషమం, వెంటిలేటర్ పై చికిత్స

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ గురించి సినీ ప్రియులకు తెలిసే ఉంటుంది. వందలాది చిత్రాలకు తన అద్భుతమైన డాన్స్ కొరియోగ్రఫీ అందించారు. బుల్లితెరపై డాన్స్ షోలలో జడ్జిగా కూడా పనిచేశారు.

Choreographer Shiva Shankar Master  in critical condition
Author
Hyderabad, First Published Nov 24, 2021, 11:23 PM IST

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ గురించి సినీ ప్రియులకు తెలిసే ఉంటుంది. వందలాది చిత్రాలకు తన అద్భుతమైన డాన్స్ కొరియోగ్రఫీ అందించారు. బుల్లితెరపై డాన్స్ షోలలో జడ్జిగా కూడా పనిచేశారు. రొమాంటిక్, విభిన్నమైన పాటలకు శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తూ సౌత్ లో పాపులర్ అయ్యారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్త చిత్ర పరిశ్రమని షాక్ లోకి నెట్టింది. 

shiva shankar master కరోనా బారిన పడడంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆయన్ని గచ్చిబౌలిలోని ఏజీఐ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. వైద్యులు శివశంకర్ మాస్టర్ కువెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. మరో దయనీయకర పరిస్థితి ఏంటంటే.. ఆయన కుటుంబంలో శివశంకర్ మాస్టర్ కుమారుడు అజయ్ కృష్ణ మినహా మిగిలిన వారంతా Covid కి గురైనట్లు తెలుస్తోంది. 

దీనితో ఆసుపత్రి ఖర్చుల కోసం వారి ఆర్థిక స్థోమత సరిపోవడం లేదట. దీనితో అజయ్ కృష్ణ ఇండస్ట్రీలో ఎవరైనా పెద్దమనసు చేసుకుని సహాయం చేస్తారేమోనని అజయ్ కృష్ణ ఎదురుచూస్తున్నారు. శివశంకర్ మాస్టర్ అసాధారణమైన కొరియోగ్రాఫర్. ఆయన గౌరవ డాక్టరేట్ తో పాటు అనేక అవార్డులు కూడా అందుకున్నారు. 

బాహుబలి, మగధీర, మహాత్మ, అమ్మోరు, అరుంధతి లాంటి ఎన్నో హిట్ చిత్రాలకు ఆయన కొరియోగ్రఫీ అందించారు. మగధీర చిత్రంలో 'ధీర ధీర' సాంగ్ కి కొరియోగ్రఫీ అందించింది శివశంకర్ మాస్టరే. ఆ పాటకు గాను శివశంకర్ మాస్టర్ కి నేషనల్ అవార్డు దక్కడం విశేషం. మగధీర చిత్రంలో ఆ సాంగ్ ఓ విజువల్ ఫీస్ట్ గా ఉంటుంది. 

శివశంకర్ మాస్టర్ 1975లోనే చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టారు. సౌత్ ఇండియన్ భాషల్లో చిత్రాలకు కొరియోగ్రఫీ అందిస్తూ ఎదిగారు. అలాగే నటుడిగా కూడా అనేక చిత్రాల్లో శివశంకర్ మాస్టర్ రాణించారు. డాన్స్ మాస్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితి నుంచి ఆయన కుటుంబం త్వరగా బయట పడాలని కోరుకుంటున్నారు. శివశంకర్ మాస్టర్ కుటుంబానికి ఎవరైనా సాయం చేయాలని భావిస్తే ఆయన కుమారుడు అజయ్ కృష్ణ ఫోన్ నంబర్ 9840323415 కు కాల్ చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. 

Also read: ఏపీ టికెట్ ధరల ఎఫెక్ట్: దిక్కుతోచని స్థితిలో టాలీవుడ్.. అఖండ నుంచి పెద్ద చిత్రాలే, నిర్మాతల ప్లాన్ ?

Follow Us:
Download App:
  • android
  • ios