టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరితో వర్క్ చేసిన డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ కి మేడ్చల్ కోర్ట్ ఆర్నెల్లు జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ లో ఒక్కసారిగా అందరిని షాక్ కి గురి చేసింది. చిరంజీవి - రామ్ చరణ్ - పవన్ కళ్యాణ్ ఇలా మెగా ఫ్యామిలీ అనే కాకుండా ఇతర స్టార్ హీరోలతో కూడా ఈ కోరియేగ్రాఫర్ అదిరిపోయే స్టెప్పులు వేయించారు. 

అయితే జానీ మాస్టర్ పై నాలుగేళ్ళ కిందట కేసు నమోదయ్యింది. 2015 లో చెక్ బౌన్స్ విషయంలో కేసు నమోదవ్వగా ఇప్పటికి కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. కేసులో మరో అయిదుగురు నిందితులకు కూడా శిక్ష పడినట్లు సమాచారం. 

మొదటి సెక్షన్ 354, 324, అలాగే 506 కింద కేసులు నమోదవ్వగా సెక్షన్ 354 కేసును కొట్టివేసి మిగతా కేసులు నిజమని నిర్దారించారు. అందుకు 6 నెలల శిక్ష విధించినట్లు తెలుస్తోంది.  చెక్ బౌన్స్ తో పాటు మరికొన్ని కేసులు కూడా జానీ మాస్టర్ పై ఉన్నట్లు తేల్చారు.