ఇప్పుడు మరో కొరియోగ్రాఫర్‌ జానీ మాసర్‌ హీరోగా మారుతున్నారు. ఆయన హీరోగా `జే 1`(వర్కింగ్‌ టైటిల్‌)ని సినిమా తెరకెక్కుతుంది. మురళీరాజ్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాని సుజీ విజువల్స్ బ్యానర్స్ పతాకంపై కె. వెంకట్‌ రమణ నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాని సోమవారం ప్రారంభించారు. పూజా కార్యక్రమాలతో ఓపెన్‌ చేశారు. ఇందులో టాలీవుడ్‌కి చెందిన బిగ్‌ సెలబ్రిటీస్‌ పాల్గొన్నారు. మరోవైపు ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో జానీ మాస్టర్ చేతికి కర్చీఫ్‌ చుట్టుకుని ఉన్నారు. అందులో పరిశ్రమలు, ఓడరేవు, రైల్వే ట్రాక్‌, కోర్ట్ వంటి దృశ్యాలున్నాయి. విభిన్నమైన కథతో ఈ సినిమా రూపొందుతుందని అర్థమవుతుంది.

 ఇదిలా ఉంటే జానీ మాస్టర్‌ మొదట దర్శకుడిగా మారతానని చెప్పాడు. ఇటీవల ఆయన డైరెక్షన్‌పై కోరికని వెల్లడించారు. అంతేకాదు తన అభిమాన హీరో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో ఓ సినిమాని డైరెక్ట్ చేస్తానని చెప్పారు. రామ్‌చరణ్‌ నిర్మాతగా ఈ సినిమా ఉంటుందనే వార్తలు వినిపించాయి. కానీ తాజా హీరోగా కొత్త సినిమాని ప్రకటించి అందరిని షాక్‌ కి గురి చేశారు.