Yatra 2 : ‘నీడలేని నేనా వీళ్ల ధైర్యం’.. ‘యాత్ర2’ నుంచి 'చూడు నాన్న' సాంగ్.. లిరిక్స్ విన్నారా?

వైస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న ‘యాత్ర2’ Yatra 2 నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. ‘చూడు నాన్న’ అనే టైటిల్ తో వదిలిన పాటలోని లిరిక్స్  హృదయాలను కదిలించేలా ఉన్నాయి. 

Choodu Nanna Emotional Song out from Yatra 2 NSK

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమే ‘యాత్ర2’. 2019లో ‘యాత్ర’గా వచ్చి అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దానికి సీక్వెల్ గానే Yatra 2ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు.  

త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుంచి యూనిట్ వరుసగా అప్డేట్స్ ను అందిస్తోంది. ఇప్పటికే యాత్ర 2 మోషన్ పోస్టర్, టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇక తాజాగా సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ను కూడా విడుదల చేశారు. ‘చూడు నాన్న’ (Choodu Nanna) అనే టైటిల్ తో వచ్చిన ఈ సాంగ్ చాలా ఎమోషనల్ గా సాగింది. 

లిరిక్స్ విషయానికొస్తే... ‘చూడు నాన్న.. చూస్తున్నావా నాన్న.. నీడలేని నేనా వీళ్ల ధీమా.. ఏమిటీ ఇంతటి ప్రేమా.. నాదారేటో తోచకుంటే నీవెంబడే మేము అంటూ కదిలారు ఏంటో ఆ నమ్మకం.. నేనెలా ఒడ్డుకు చేరడం వీళ్లనెలా ఒడ్డుకు చేర్చడం.. ఇంటిపెద్ద కన్నుమూస్తే అయినవాళ్లు అనాథలేగా నువ్వేలేక ఊరుఊరంతా అనాథలేగా’ అంటూ సాగిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. భాస్కరభట్ల, రవికుమార్ లిరిక్స్ అందించారు. విజయ్ నరెన్ అద్భుతంగా పాడారు. సంతోష్ నారాయణ్ క్యాచీ ట్యూన్ ను ఇచ్చారు. 

ఇక 2009 నుంచి 2019 వరకు జగన్ రాజకీయ ప్రయాణంపై యాత్ర 2 ఉంటుందని దర్శకుడు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. జగన్ పాత్ర జీవా, వైఎస్ పాత్రలో మమ్ముట్టీ నటిస్తున్న సంగతి తెలిసిందే. శివ మేక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికే రావాల్సిన ఈ చిత్రం ఫిబ్రవరికి ఫిఫ్ట్ అయ్యింది. వచ్చే నెల 8న విడుదల కాబోతుంది.  

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios