సౌత్ ఇండియాలో విలక్షణ నటుల్లో ఒకరైన చియాన్ విక్రమ్ ఏం చేసినా ఒక ప్రయోగమే. ఎందుకంటే ఆయన చేసే పాత్రలకు ఒక దానికొకటి మ్యాచ్ ఉండదు. పైగా చూసిన ప్రతిసారి ఎదో ఒక కొత్తదనంగాను ఆశ్చర్యంగానూ ఉంటుంది.
సౌత్ ఇండియాలో విలక్షణ నటుల్లో ఒకరైన చియాన్ విక్రమ్ ఏం చేసినా ఒక ప్రయోగమే. ఎందుకంటే ఆయన చేసే పాత్రలకు ఒక దానికొకటి మ్యాచ్ ఉండదు. పైగా చూసిన ప్రతిసారి ఎదో ఒక కొత్తదనంగాను ఆశ్చర్యంగానూ ఉంటుంది. ప్రస్తుతం ఈ డిఫరెంట్ యాక్టర్ కండరం కొండన్ అనే సినిమా చేస్తున్నాడు.
ఫస్ట్ లుక్ ను దీపావళి సందర్బంగా చిత్ర యూనిట్ నేడు రిలీజ్ చేసింది. అందులో అపరిచితుడు పాత్రని మరిపించే విధంగా విక్రమ్ ఒక రాక్షసుడిలా పొగలు కక్కుతున్నాడు. ఈ సినిమాలో మ్యాటర్ తప్పకుండా ఉంటుందని గ్యారెంటీగా చెప్పవచ్చు. ఎందుకంటే సినిమాను నిర్మిస్తోంది కమల్ హాసన్ కాబట్టి.
ఇక కమల్ తో చీకటి రాజ్యం అనే సినిమా చేసినా రాజేష్ దర్శకత్వం వహిస్తుండగా కమల్ సినిమాలకు ఎక్కువగా సంగీతం అందించే జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు. ఫస్ట్ లుక్ తోనే అందరిని ఆకట్టుకుంటున్న చిత్ర యూనిట్ రిలీజ్ తరువాత ఇంకెంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.
