డిఫరెంట్ లుక్ లో చియాన్ విక్రమ్, ఈసారి పక్కాగా ప్లాన్ చేశాడుగా..?

ప్రయోగాలు చేయడంలో తమిళ స్టార్ హీరో విక్రమ్ తరువాతే ఎవరైనా.. ఇప్పటికే రకరకాల వేశాలు కట్టి సీనియర్ హీరో.. ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తాడు. 
 

Chiyaan Vikram Different Look Poster Viral

తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు చియాన్‌ విక్రమ్‌. తమిళంతో పాటు తెలుగులో కూడా సినిమాలు చేసిన విక్రమ్.. తమిళ డబ్బింగ్ తెలుగు సినిమాలతో బాగా ఫేమస్ అయ్యాడు. అపరిచితుడు సినిమాతో తెలుగులో భారీ క్రేజ్ సాధించిన విక్రమ్. అప్పటి నుంచీ ప్రయోగాత్మక సినిమాలతో తన అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు. సక్సెస్ ఫెయిల్యూర్ ను లెక్క చేయకుండా ఆడియన్స్ ను అలరించడమే పనిగా పెట్టుకున్నాడు విక్రమ్. 

అయితే  విక్రమ్‌ ఎన్ని ప్రయోగాలు చేసినా.. ఆయనకు  ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయాయి. విక్రమ్  మీద పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కు విక్రమ్ రీచ్‌ కాలేకపోయాడు. కాగా గతకొంత కాలంగా సరైన హిట్టు లేక నిరాశలో ఉన్న విక్రమ్‌కు పొన్నియన్‌ సెల్వన్‌ కాస్త ఊరటనిచ్చింది. ప్రస్తుతం అదే జోష్‌తో మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు విక్రమ్. చియాన్ డిఫరెంట్ గా కనిపించబోతున్న మరో సినిమా తంగలన్‌.

 

19 శతాబ్ధంలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్స్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈసినిమాను పా.రంజిత్‌ డైరెక్ట్ చేశాడు.  ఈ సినిమా ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ గా  షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, టీజర్‌ సినిమాపై ఎక్కడేలేని అంచనాలు క్రియేట్‌ చేశాయి. ఈ సినిమా . తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి షూటింగ్ చేస్తున్నారు. ఇక ఇతర భాషల్లో భాషల్లో డబ్బింగ్‌ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంతే కాదు... ఈసినిమాను 3డీలో రూపొందిస్తున్నారని సమాచారం‌. ఇక ఈ మూవీలో విక్రమ్ లుక్ అన్నింటికంట కొత్తగా ఉండబోతోంది. ఈ లుక్స్ ను విక్రమ్ తన సోషల్ మీడియా ఫేజ్ లో అప్ లోడ్ చేశాడు. ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

బ్యాక్‌ టు ది ఫ్యూచర్‌ అంటూ విక్రమ్‌ ఈ సినిమలోని తన పాత్రకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.జీవి. ప్రకాష్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ పతాకంపై కే.ఈ జ్ఞానవేల్‌ రాజా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. అపరిచితుడు తరువాత శివపుత్రుడు, ఐ, కోబ్రా లాంటి సినిమాలలో విక్రమ్ క్యారెక్టర్ కొత్తగా ఉండి అలరించింది. ఈసారి అంతకు మించి అన్నట్టుగా కనిపించబోతున్నాడు స్టార్ హీరో.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios