రెండేళ్ల క్రితం వచ్చిన `చీకటి గదిలో చితక్కొట్టుడు` ఎంతటి వివాదాన్ని రేపిందో తెలిసిందే. ఆ తర్వాత అడల్ట్ కంటెంట్‌తో వచ్చిన ఆ సినిమాకి ఇప్పుడు సీక్వెల్‌ `చితక్కొట్టుడు` వస్తోంది. తొలి చిత్ర దర్శకుడు సంతోష్‌ పి.జయకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. `ఘోస్ట్ 2.0 హాటెస్ట్ ` ట్యాగ్‌లైన్‌తో  సినిమా రాబోతుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ని విడుదల చేశారు. 

ఫ్లైయింగ్ హార్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ఎస్ హ‌రి భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళంలో `ఇరాండ‌మ్ కూత్తు` పేరుతో రూపొందగా, దీన్ని తెలుగులో `చిత‌కొట్ట‌డు 2` రాబోతుంది. ఈ సందర్బంగా చిత్ర బృందం చెబుతూ, `గ‌తంలో సంతోష్ పి జ‌య‌కుమార్ త‌మిళంలో తెరకెక్కించిన `ఇర‌త్తు అరియిల్ మురత్తు కూత్తు`, `గ‌జ‌నీకాంత్` వంటి సినిమాలు క‌మ‌ర్షీయ‌ల్ సూప‌ర్ హిట్స్ గా నిలిచాయి. ఈ నేప‌థ్యంలో `చిత‌కొట్ట‌డు 2 `ని గ‌తంలో వ‌చ్చిన అడ‌ల్ట్ హ‌రర్ కామెడీల కంటే మరింత ఎంట‌ర్ టైనింగ్ గా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాడు ద‌ర్శ‌కుడు సంతోష్ పి జ‌య‌కుమార్. అంతేకాదు ఈ చిత్రంలో తానే స్వ‌యంగా హీరోగా న‌టించ‌డం విశేషం.

 సంతోష్ కి జోడిగా ఈ మూవీలో క‌రిష్మా, మీన‌ల్, ఆకృతి సింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌ల చేసిన `చిత‌కొట్ట‌డు 2` ఫ‌స్ట్ లుక్ లో రొమాంటిక్ ఆడియెన్స్ కి కావాల్సిన అంశాలు అన్నిటితో పాటు అడ‌ల్ట్ కామెడీ ఎలిమెంట్స్ కూడా ఉండేలా డిజైన్ చేసి అనూహ్య స్పంద‌న అందుకున్న ద‌ర్శ‌కుడు సంతోష్ పి జ‌య‌కుమార్ అండ్ టీమ్, ఇప్పుడు విడుదల చేసిన టీజర్‌ మరింత హాట్‌గా ఉంది. అంతేకాదు హాటెస్ట్ టీజ‌ర్ అనే ట్యాగ్ తోనే ఈ టీజ‌ర్ ని విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం` అని చెప్పారు. 

 ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి చేసుకుని త్వ‌ర‌లోనే తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా హీరో క‌మ్ డైరెక్ట‌ర్ సంతోష్ పి జ‌య‌కుమార్ తెలిపారు. ఇదిలా ఈ సినిమాపై తమిళనాట అనేక విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీన్ని బ్యాక్‌ చేయాలని పలు రాజకీయ పార్టీలు, సమాజిక వేత్తలు, సినీ ప్రముఖులు డిమాండ్‌ చేశారు. మరి తెలుగులో ఎలాంటి విమర్శలు వస్తాయో చూడాలి.