Asianet News TeluguAsianet News Telugu

షాక్: 'వాల్తేరు వీరయ్య' లో చిరు డైలాగు...కమెడియన్ చెప్పిన డైలాగుకు కాపీ?

నిన్నజరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం చాలా ఉత్సాహంగా సాగింది. ట్రైలర్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే అదే సమయంలో సోషల్ మీడియా

Chiru Waltair Veerayya dialogue copy from Winner movie?
Author
First Published Jan 9, 2023, 7:28 AM IST


సోషల్ మీడియా వచ్చాక ఫ్యాన్ వార్ రూపం మార్చుకుంది. ప్రతీ విషయాన్ని యాంటి ఫ్యాన్స్ చాలా జాగ్రత్తగా చూసి ట్రోల్ చేస్తున్నారు. అదే సమయంలో తమ హీరోకు సంబందించిన ప్రతీ చిన్న విషయాన్ని ఫ్యాన్స్ ఓ రేంజిలో లేపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా వాల్తేరు వీరయ్య ట్రైలర్ లోని ఓ డైలాగుని కాపీ అంటూ ఓ  క్లిప్ సోషల్ , వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇ ఈ సినిమాలోని ఓ సీన్ ను వేరే సినిమా నుండి కాపీ కొట్టారు అంటూ ట్రోల్ చేస్తున్నారు.  

వాల్తేరు వీరయ్య ట్రైల‌ర్ లో చిరంజీవి... రికార్డుల్లో నా పేరు ఉండ‌టం కాదు…..నా పేరు మీద‌నే రికార్డ్స్ ఉంటాయి అంటూ డైలాగ్ చెప్పారు. అయితే ఇదే డైలాగును క‌మెడియ‌న్ పృధ్వీ....సాయి ధరమ్ తేజ హీరోగా వచ్చిన  విన్న‌ర్ సినిమాలో కామెడీగా చెప్పాడు. రికార్డుల్లో నా పేరు ఉండ‌టం ఏంట్రా…నా పేరు మీద‌నే రికార్డులు ఉంటాయ్…సుజాత సింగం సుజాత అంటూ డైలాగ్ చెప్పాడు. ఆ సినిమాకు గోపిచంద్ మలినేని డైరక్టర్. ప్రస్తుతం సంక్రాంతికి గోపీచంద్ మలినేని, బాబి సినిమాల మధ్యనే పోటీ నడుస్తోంది.  ఈ నేఫధ్యంలో ఈ డైలాగు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దాంతో బాబీ అన్నా ఈ పంచ్ డైలాగ్ ను అక్క‌డ లేపావా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆ వీడియోని కట్ చేసి వైరల్ చేస్తున్నారు.

అయితే ప్రతీ దాన్ని కాపీ అనలేము. ఒకరికి వచ్చిన ఆలోచన మరొకరు రావచ్చు. లేకపోతే  సినిమాలో అలాంటి డైలాగు...ఆ టైమ్ లో అవసరం ఉండి వచ్చు. ఒకరు మాట్లాడిన మాటలు మనం మాట్లాడటం లేదా...అది కాపీ అంటే ఎలా అనేది కొందరి అభిమానుల వాదన. ఏదైమైనా బాబి...ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు రాసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది అనేది నిజం.
 

 ఇక మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల కాంబినేషన్ లో రూపొందిన భారీ అంచనాలు వున్న మాస్ ఎంటర్ టైనర్ 'వాల్తేరు వీరయ్య' . ఈ సినిమాను 2023 సంక్రాంతికి చూడటానికి ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని  భారీగా ప్రమోట్ చేస్తున్నారు నిర్మాతలు మైత్రీ మూవీస్ వారు.నిన్నజరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం చాలా ఉత్సాహంగా సాగింది. ట్రైలర్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 

ఇక ఇప్పటికే చిరంజీవికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. పవర్ ఫుల్ పోలీస్-విక్రమ్ సాగర్ ఏసీపీగా రవితేజ పాత్రను పవర్ ప్యాక్డ్ గా పరిచయం చేస్తూ  ఫస్ట్ లుక్ , టీజర్ను విడుదల చేశారు మేకర్స్. బిల్డ్-అప్ షాట్ లు పర్ఫెక్ట్ ఎలివేషన్స్ ఇచ్చాయి. 

ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండ  రాక్ స్టార్  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత. ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా, నిరంజన్ దేవరమానె ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. 

ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్మెంట్లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. సినిమా సెన్సార్ కూడా  పూర్తయింది.  వాల్తేరు వీరయ్య' జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios