Asianet News TeluguAsianet News Telugu

హానుమాన్ రిలీజ్ ఆపాలని కుట్రలు, రంగంలోకి ప్రభాస్, బాలయ్య, మెగాస్టార్, ప్రశాంత్ వర్మ ఏం చెప్పాడంటే..?

హానుమాన్ మూవీకి సబంధించిన అనుమానాలకు క్లారిటీ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. మూవీ రిలీజ్ అవ్వకుండా ఆపాలని కుట్రలు చేశారన్నారు. ఇక  ఈసినిమాకు సపోర్ట్ గాస్టార్స్ ను రంగంలో దించే పనిలో ఉన్నాడు డైరెక్టర్. 

Chiru and Balayya and Prabhas Support Hanuman Movie JMS
Author
First Published Dec 31, 2023, 10:20 AM IST

ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సినిమా ఒక్కటే హనుమాన్. స్టార్ హీరోల సినిమాలు.. భారీ బడ్జెట్ సినిమాలకు ఎదురెళ్తూ.. సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది సినిమా. ఇక ఈసినిమాపై చాలా మందిలో చాలా డౌట్లు ఉన్నాయి. వాటన్నింటికి క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. అంతే కాదు. ఈసినిమాను ఆపాలని కుట్రలు చేశారంటున్నాడు. 'సినిమాకు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు, సెన్సార్ విషయంలో కూడా ఇబ్బందిపెట్టాలని చూశారు. అయినా సరే భయపడేది లేదు.. అనుకున్నరోజే రిలీజ్ కు వస్తున్నాం అని క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్. 

చిన్న సినిమా అయినా.. పెద్ద ప్రభావం చూపిస్తోంది హానుమాన్. బాలనటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి.. హీరో మెటీరియల్ అని నిరూపించుకున్న తేజ్ సజ్జా.. లీడ్ రోల్ చేస్తున్న ఈసినిమా సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే కాస్తముందు నుంచే ఈమూవీ టీమ్ ప్రచారంస్టార్ట్ చేశాయి. పెద్ద సినిమాలతో పోటీకి దిగడంతో ఈసిసినిమాపై ఒత్తడి కూడా అదే రేంజ్ లో ఉంది. కాని హీరో, దర్శకుడితో పాటు.. టీమ్ అంతా పక్కా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇంత వెయిట్ ఉన్న సినిమా చేయడానికి ఎలా దైర్యంచేశారని తేజ్ ను మీడియా ప్రశ్నించగా.. చాలా కాన్ఫిడెంట్ గా సమాధానంచెప్పాడు. ఈ ప్రశ్న ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్న వారసులను అడుగుతారా..? వారు కూడా పెద్ద సినిమాలు చేస్తున్నారు కదా అని సమాధానం చెప్పి.. ఇంప్రెస్ చేశాడు. 

రామ్ చరణ్ లో అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు, వైరల్ అవుతున్నయాక్టింగ్ స్కూల్ వీడియో..

ఇక ప్రశాంత్ వర్మ ఈసినిమాకు సబంధించి కొన్ని విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా ఈసినిమాలో మెగాస్టార్ చిరంజీవి హనుమంతుని పాత్రలో కనిపించబోతున్నాడు అన్న ప్రచారంపై కూడా వివరణ ఇచ్చారు. ముఖ్యంగా వీడియోలో మెగాస్టార్ కళ్ళు కనిపించడం పెద్ద చర్చకు దారి తీసింది. అయితే ఈ పాత్రకోసం మెగాస్టార్ నుసంప్రదిస్తే.. ఆయన నో చెప్పారని.. దాంతో ఆయన కళ్లు మాత్రం వాడుకున్నట్టు దర్శకుడు చెప్పారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కోసం స్టార్ హీరోలను ప్రశాంత్ వర్మ సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య అభయం ఇచ్చేశాడట. సినిమా కోసం ఏం చేయాలో చెప్పు అని అడిగినట్టు తెలుస్తోంది. అటు ప్రభాస్  కూడా ఈసినిమా ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రీ రిలీజ్ కు గెస్ట్ గా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి స్టార్స్ ను ఏ రకంగా ప్రచారానికి వాడుకుంటాడు అనేది చూడాలి.  

ఇక సంక్రాంతి బరిలో ఉన్న మహేష్ లాంటి స్టార్ హీరోలను దాటుకుని హానుమాన్ సినిమాను ఎలా గట్టిస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తి కరంగా మారింది. హానుమాన్ సినిమా సక్రాంతి హిట్ గా నిలిస్తే.. హీరోగా తేజ్ సజ్జా.. దర్శకుడిగా ప్రశాంత్ వర్మ రేంజ్  మారిపోయే అవకాశం ఉంది. తేజ్ కు అవకాశాలతో పాటు స్టార్ డమ్ పక్కాగా ఫిక్స్అయినట్టే.. ఇక సంక్రాంతి వార్ లో ఏంజరుగుతుందో చూడాలి. దాదాపు 11 భాషల్లో భారీ బడ్జెట్​తో రూపొందిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రానుంది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios