మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లతో మల్టీస్టారర్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ కాంబినేషన్ సెట్ చేసే పనిలో పడ్డారు.

ఈ కాంబో సెట్ అయితే సినిమాపై అంచనాలు పెరగడంతో పాటు సినిమా రైట్స్ దక్కించుకోవాలని డిస్ట్రిబ్యూటర్స్ మధ్య పోటీ పెరుగుతుంది. అందుకే దిల్ రాజు ఈ కాంబోలో సినిమా చేయాలనుకుంటున్నాడట. 'బృందావనం','ఊపిరి' వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు.

అయితే ఇప్పటివరకు వంశీ ఈ ఇద్దరు హీరోలకు కథ మాత్రం నేరేట్ చేయలేదు. ప్రస్తుతం వంశీ.. మహేష్ బాబు 'మహర్షి' సినిమాతో బిజీగా గడుపుతున్నారు. ఇది పూర్తయిన తరువాత చిరు, బన్నీలను డైరెక్ట్ చేయాలని ఆశ పడుతున్నాడు ఈ డైరెక్టర్.

ప్రస్తుతానికి చిరు 'సై రా'తో బిజీగా ఉన్నాడు. అలానే బన్నీ.. త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యే వరకు వంశీ పైడిపల్లి ఎదురుచూడాల్సిందే.. మరోపక్క చిరుతో సినిమా చేయడానికి కొరటాల కూడా లైన్ లో ఉన్నాడు. మరి ముందుగా ఏ సినిమా సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి!