చిరంజీవి వీరాభిమాని అత్యుత్సాహం

ఇదే చిరంజీవి 151వ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అన్నట్లు ఈ పోస్టర నిన్నటి నుంచి సోషల్ మీడియా చక్కర్లు కొడుతూ ఉంది. 

దీనితో పాటు ఎలాంటి సమాచారం లేకుండా సంచారం చేస్తున్న ఈ పోస్టర్ గురించి వాకబు చేస్తే ఇది అసలు పోస్టర్ కాదని, ఎవరో అభిమాని అత్యుత్సాహంతో ఈ పోస్టర్ హాలివుడ్ స్టయిల్లో రూపొందించి సోషల్ మీడియాలోకి వదిలాడు.

అత్రంగా చిరు 151 కోసం ఎదురుచూస్తున్న ప్రపంచవ్యాపిత అభిమానులంతా ఈ పోస్టర్ నిజమేననుకుని షేర్ చేయడం మొదలుపెట్టారు. 

ఈ చిత్రంలో నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు.

ఉయ్యాల వాడ నరహింహారెడ్డి రాయలసీమ ప్రాంతానికి చెందిన పాలెగాడు. కర్నూలు జిల్లాలో కొవెలకుంట్లలో జన్మించాడు. నైజాంకాలంలో ఆయన ఈ ప్రాంతగ్రామాలను అదుపు చేస్తూ వచ్చాడు. నైజాం ఈ జిల్లాలను బ్రిటిష్ వారి దత్తత చేశాక బ్రిటిష్ పెత్తనం ఆయన ప్రశ్నించారు. కప్పం కట్టేందుకు నిరాకరించాడు. బ్రిటిష్ పెత్తనానికి వ్యతిరేకంగా తన సైన్యంతో తిరగబడ్డాడు. చరిత్రకారులు ఇదే మొదటి తిరుగుబాటు గా చెబుతారు. దీంతర్వాత పదేళ్లకు 1857 తిరుగుబాటు వచ్చింది. ఆయనను పట్టుకునేందుకు బ్రిటిష్ సైన్యం వచ్చింది. 1846 అక్టోబర్ 6న అర్ధరాత్రి ఆయన్నిపట్టుకున్నారు. కొట్టారు. హింసించారు. కొయిలకుంట్లకు తీసుకువచ్చారు. రాజద్రోహ నేరం మోపారు. 1847 ఫిబ్రవరి22 కుందునది ఒడ్డున బహిరంగంగా ఉరితీశారు.

ఈ తిరుగుబాటును డైరెక్టర్ సురేందర్ రెడ్డి చిరు-151కి ఎన్నుకున్నారు. ఇపుడు ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగాసాగుతన్నపుడు మెరుపులాగా ఈపోస్టర్ తారసపడింది.

హాలివుడ్ స్టయిల్లో ఉయ్యాల వాడ నరసింహారెడ్డి పేరు యు ఎన్ (UN) అని ఇంగ్లీష్ లో కుదించి, చాలా గొప్పగా, ఎలాంతి అనుమానం రాకుండా ఉండేలా డిజైన్ చేసి జనంలోకి వదిలారు.

ఇక పోతే, సినిమా చిత్రీకరణ ఎపుడు మొదలవుతుందనే సమాచారం లేనపుడు ఈ పోస్టర్ రావడం ఒక సంచలనం సృష్టించింది.