కళ్యాణ్‌ బాబు నీకు ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలుసు.. తమ్ముడు పవన్ కి చిరంజీవి హార్ట్ టచ్చింగ్‌ విషెస్‌

తమ్ముడు పవన్ కళ్యాణ్‌ పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుపొందిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. హార్ట్ టచ్చింగ్‌ పోస్ట్ పెట్టారు. 
 

Chiranjeevi wish to pawan kalyan with heart touching post arj

పవన్‌ కళ్యాణ్‌ ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ప్రత్యర్థి వైసీపీ నాయకురాలు వంగా గీతాపై భారీ విజయాన్ని సాధించారు. సుమారు డెబ్బై వేలకు పైగా కోట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ నుంచి అందరు పవన్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టాలీవుడ్‌ మొత్తం పవన్‌కి విషెస్‌ తెలియజేస్తున్నారు. 

ఈ క్రమంలో అన్న మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మొదట్నుంచి పవన్‌ కి సపోర్ట్ గా నిలిచారు చిరు. అంతేకాదు ఎన్నికలకు ముందు ఐదు కోట్ల విరాళం కూడా అందించాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సొంత తమ్ముడు ఎన్నికల్లో గెలవడంతోపాటు తన పార్టీ నుంచి పోటీ చేసిన 21 మంది విజయం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో చిరంజీవి పట్టరాని సంతోషంతో స్పందించారు. ఎమోషనల్‌ వర్డ్స్ పంచుకున్నారు. 

`డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా  అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన  ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ  కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని  నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో  నీకు శుభం కలగాలని , విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా` అంటూ హార్ట్ టచ్చింగ్‌ వర్డ్స్ వెల్లడించారు చిరంజీవి. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. 

2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు అన్నకోసం గట్టిగా పోరాడాడు పవన్‌ కళ్యాణ్‌. అప్పట్లో ఆయన స్పీచ్‌లకు యువత ఉర్రూతలూగింది. ఓ ఉప్పెనలా సాగింది. కానీ ఆ ఎన్నికల్లో చిరంజీవి పార్టీ 18 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశాడు చిరు. కానీ ఆ తర్వాత పవన్‌ తనే సొంతంగా జనసేనా పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. గతేడాది ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేసి కూటమి 159 సీట్ల గెలుపులో కీలక భూమిక పోషించారు పవన్‌. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios