రీఎంట్రీ తర్వాత అన్నా తమ్ముళ్ల దూకుడు మామూలుగా లేదు. ఓ వైపు తమ్ముడు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీ ఇస్తూనే ఐదారు సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఇప్పటికే మూడు సినిమాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు అన్న మెగాస్టార్‌ చిరంజీవి కూడా దూకుడు పెంచాడు. ఆయన ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. 

మరోవైపు `లూసిఫర్‌` రీమేక్‌, `వేదాళం` రీమేక్‌ చిత్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వీటిలో మొదట `లూసిఫర్‌` రీమేక్‌ చిత్రంలో నటించనున్నారు. దీనికి తమిళ దర్శకుడు మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమా ప్రారంభమయ్యే డేట్‌ని ఫిక్స్ చేశారట. ఈ నెల 21న గ్రాండ్‌గా ఓపెనింగ్‌ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఓపెనింగ్‌ చేసిన వెంటనే సెట్స్ పైకి వెళ్లనున్నారని తెలుస్తుంది. దాదాపు నెలరోజులపాటు ఈ సినిమా షూటింగ్‌ జరిపి, ఆ తర్వాత `వేదాళం` రీమేక్‌ని స్టార్ట్ చేసే అవకాశాలున్నాయి.