Asianet News TeluguAsianet News Telugu

ఐడియా అద్బుతమే... కానీ వర్కవుట్ అవుతుందా?

రీసెంట్ గా చిరంజీవి.. లూసిఫర్ రీమేక్ చేయాలని డైరక్టర్ ని పెట్టుకుని, స్క్రిప్టు వర్క్ చేయించారు. అది పూర్తయ్యేలోగా ఆయనకు మరో ఆలోచన వచ్చింది. అజిత్ చేసిన వేదాళం చిత్రం తను రీమేక్ చేస్తే హిట్ అనిపించిందిట. ఈ మేరకు ఆయన కొన్ని మార్పులు , చేర్పులుతో స్క్రిప్టు వర్క్ చేయిస్తున్నారట.  అంతా ఓకే అనుకున్న సమయంలో చిరుకు ఓ ఆలోచన వచ్చిందిట. 
 

Chiranjeevi wants to remake Ajith Vedalam
Author
Hyderabad, First Published Aug 7, 2020, 8:46 AM IST

రీమేక్ లో ఉన్న సుఖం వేరు. ఆల్రెడీ సక్సెస్ అయిన రికార్డ్ దానికి ఉంటుంది. కొద్దిపాటి నేటివిటీకు సంభందించిన మార్పులు చేస్తే సరిపోతుంది. అలాగే బిజినెస్ కూడా స్పీడుగా జరుగుతుంది.  అందుకే హీరోలు రీమేక్ ల వైపు మ్రొగ్గు చూపెడుతూంటారు. రీసెంట్ గా చిరంజీవి..లూసిఫర్ రీమేక్ చేయాలని డైరక్టర్ ని పెట్టుకుని, స్క్రిప్టు వర్క్ చేయించారు. అది పూర్తయ్యేలోగా ఆయనకు మరో ఆలోచన వచ్చింది. అజిత్ చేసిన వేదాళం చిత్రం తను రీమేక్ చేస్తే హిట్ అనిపించిందిట. ఈ మేరకు ఆయన కొన్ని మార్పులు , చేర్పులుతో స్క్రిప్టు వర్క్ చేయిస్తున్నారట.

తమిళ సూపర్ స్టార్ తల అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం అప్పట్లో పెద్ద హిట్. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తొలి వారంలోనే రూ.45కోట్లకు పైగా వసూలు చేసి సౌత్ సినిమా స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. లాంగ్ రన్ లో  వంద కోట్లు వసూలు చేసిన 'వేదలం' సినిమాపై టాలీవుడ్ హీరోల కన్నుపడింది. మొదట ఆ సినిమాని పవన్ తో చేద్దామనుకున్నారు. ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎస్.ఐశ్వర్య నిర్మించనున్న ఈ చిత్రానికి ఆర్.టి.నేసన్ దర్శకుడుగా ఎంపిక చేసారు. విజయదశమి సందర్భంగా సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైందీ చిత్రం. అయితే రకరకాల కారణాలతో వర్కవుట్ కాలేదు.  

అయితే ఇప్పుడు అదే సబ్జెక్టుని మెగాస్టార్ చేద్దామని ఆలోచిస్తున్నారట. అందులో భాగంగా స్క్రిప్టుని  మెహర్ రమేష్ తో రెడీ చేయిస్టున్నట్లు చెప్తున్నారు. చిరు ఇమేజ్‌కి తగ్గట్టు ‘వేదాళం’ కథలో మార్పులు చేస్తున్నారట దర్శకుడు మెహర్ రమేష్ అంటూ వార్తలు వచ్చాయి. సరైన కథ ఉంటే బిల్లా వంటి హిట్ ఇస్తారని మెహర్ రమేష్ ని చిరంజీవి నమ్మి ఈ ప్రాజెక్టు అప్ప చెప్పబోతున్నారని చెప్పుకున్నారు.

 అయితే చిరంజీవి కు మాత్రం వేదాళం చూసాక..తమిళ దర్శకుడు శివతోనే రీమేక్ చేయిస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చిందిట. అతను అయితేనే న్యాయం చేస్తారని భావిస్తున్నారు. ఈ మేరకు శివతో మాట్లాడుతున్నారట. అయితే తమిళంలో ఆల్రెడీ ప్రాజెక్టులు ఓకే అడ్వాన్స్ లు తీసుకున్న శివ..ఎంతవరకూ ముందుకు వస్తాడనేది నమ్మకం లేదు. అంతగా కాకపోతే ఓ యేడాది పైగా ఆగుదాం అంటున్నారట చిరంజీవి. చివరకు ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే శివ సీన్ లోకి వస్తే బడ్జెట్ అమాంతం నాలుగైదు రెట్లు పెరిగిపోతుంది. అతని రెమ్యునేషన్ కూడా వేరే రేంజిలో ఉంటుంది. అయితే ప్రాజెక్టుకు వచ్చే క్రేజ్ కూడా వేరు.

ఈ సినిమాను కె ఎస్ రామారావు నిర్మించానున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌లో తెరకెక్కే అవకాశం ఉంది. ఒకవేళా అలా జరగని పక్షంలో రామ్ చరణ్ సొంతంగా తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మించనున్నారట.

Follow Us:
Download App:
  • android
  • ios