మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాను చిరంజీవి కుమారుడు మెగా పవర్‌స్టార్‌ రాంచరణ్‌, నిరంజన్‌రెడ్డిలు కొణిదెల ప్రొడక్షన్‌లో నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా కాజల్‌‌ అగర్వాల్‌ నటిస్తున్న విషయం తెలిసిందే.  ఇది చిరంజీవికి 153 వ సినిమా. రకరకాల కారణాలతో  లేట్ గా  మొదలైన ఈ ఆచార్య షూటింగ్ కరోనా ఎఫెక్ట్ పడడంతో మరింత ఆలస్యం అవుతోంది. దీన్ని దాటేందుకు పక్కా ప్రణాళికతో చిరు, కొరటాల రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు పక్కా యాక్షన్ ప్లాన్ తో కొరటాల రావటంతో చిరు దాన్ని అమలు చేస్తున్నారంటున్నారు. 

అందుతున్న సమాచారం మేరకు వచ్చే నెలలోనే ఆచార్య  సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. అందుకే కొరటాల కసరత్తులు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. దాంతో అయిన మేరకు షూటింగ్, మిగతా వర్క్ ఫినిష్ చేయాలని కొరటాల భావిస్తున్నారు. చిరంజీవికు కేసులు తగ్గేదాకా షూటింగ్ మొదలెట్టాలని లేదు. కానీ కొరటాల శివ...ఆయన్ని కలిసి స్పెషల్ గా రిక్వెస్ట్ చేసారని చెప్తున్నారు. పెద్దగా నటీనటులు అవసరం లేని సీన్స్ ని తీద్దామని చెప్పారట. అందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో గుడి సెట్ వేయిస్తున్నారని, ఆగస్టు రెండవ వారంలో ఈ షూటింగ్ మొదలెడతారని తెలుస్తోంది.

అయితే ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ కొందరు సోషల్ మీడియాలో ..చిరంజీవి కొద్దికాలం ఆగితే బాగుంటుంది. ఆయన వయస్సు దృష్ట్యా ,బయిట ఉన్న పరిస్దితులు దృష్ట్యా ఆగితే బెస్ట్ అంటున్నారు. ముఖ్యంగా అమితాబ్ ఫ్యామిలీకి కరోనా రావటంతో అందరూ తమ అభిమాన స్టార్స్ ...షూటింగ్ లకు వెళ్లకుండా ఉంటేనే బెస్ట్ అని భావిస్తున్నారు. 

ఇక చిరంజీవి మరో ప్రక్క జిమ్‌లో కష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమా టైటిల్ ను ప్రకటించినప్పటి నుంచి చిరు సినిమాలో అనేక మంది స్టార్స్,నటులు కీలక పాత్రలో కనిపించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
కొరటాల శివకు కెరీర్ లో  ఇప్పటివరకు ఒక్క ప్లాప్ కూడా లేకపోవటమే కలిసొచ్చే అంసం. ఆయన ప్రతీ సినిమా ఆ హీరోల కేరీర్ లో బిగ్గెస్ట్ హిట్లు అయ్యాయి.  పక్కా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెజీనా ఒక ప్రత్యేక పాటలో కనిపించనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.