మహేష్ బాబు త్వరలో చిరంజీవి చిత్రంలో ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై అధికారికంగా ఏ వార్త రాలేదు. కానీ మాటలు మాత్రం జరిగాయని, డేట్స్, రెమ్యునేషన్ విషయం మాట్లాడుతున్నారని తెలుస్తోంది. సినిమాలో మహేష్ చెయ్యాల్సిన పాత్ర ఇరవై నిముషాలు ఉండబోతోందని,చరణ్ తో మొదట చెయ్యిద్దామని కొరటాల శివ అనుకున్నారని, అయితే మహేష్, చిరు కాంబినేషన్ అయితే ఇంకా క్రేజీగా ఉంటుందని భావించిన రామ్ చరణ్... మహేష్ ని అడగమని సూచించారని సమాచారం. కొరటాలతో మహేష్ కు ఉన్న అనుబంధంతో ఈ ప్రాజెక్టుపై ఇంట్రస్ట్ చూపించిన మహేష్ ఎప్పటిలాగే తన రెమ్యునేషన్ ని తన మేనేజర్ తో చెప్పించారట.

బీర్ బాటిల్ తో దాడి.. బిగ్ బాస్ రాహుల్ రియాక్షన్ ఇది! 

అయితే ఆ రెమ్యునరేషన్ విని నిర్మాత కన్నా ముందు చిరంజీవి షాక్ అయ్యారట. ఇరవై నిముషాల నటనకు మరీ అంతా అని ఆశ్చర్యపోయినట్లు చెప్పుకుంటున్నారు. దాంతో రామ్ చరణ్ చేస్తే సరిపోతుంది అని చిరంజీవి తన అభిప్రాయం చెప్పినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయంలో నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకోలేదుట. మహేష్ సైతం తన రెమ్యునరేషన్ ఎక్కువ అని ఫీలవుతున్నారని తెలిస్తే ప్రాజెక్టు వదిలేస్తాడు. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అయితే ఇందులో నిజం ఎంతవరకూ ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు మహేష్ ఈ ప్రాజెక్టులో ఉన్నాడో లేడో తెలియటం లేదు. చరణ్ వచ్చి చేస్తాడా లేదా అన్న విషయం తెలియరాలేదు. 

ఇక మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా 'ఆచార్య'. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో చిరంజీవి రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించనున్నారు. అలాగే అనూహ్యంగా ఈ చిత్ర టైటిల్ ను చిరంజీవి ఇటీవల ఒక ప్రీరిలీజ్ ఫంక్షన్లో అనౌన్స్ చేసారు. భారీగా ఎక్సపెక్టేషన్స్ ఉన్న ఈ సినిమా రచన సహకారం కోసం ప్రముఖ రచయితలతో కొరటాల శివ చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.తను, చిరు అనగానే పెరిగే అంచనాలను అందుకోవడానికి కొరటాల శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడట .