మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కెరీర్ మొదట్లో కొంచెం సక్సెస్ లతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల సక్సెస్ లేకపోయినా కూడా తన టాలెంట్ తో మంచి అవకాశాలనే అందుకున్నాడు. అంతా చిరు సలహాతోనే మనోడు కథలను ఎంచుకుంటూ వచ్చాడు. కానీ ఎంత సపోర్ట్ ఇచ్చినా సాయికి కలిసి రావడం లేదు. 

సాయి ఒక్కడే కాదు.. మెగా యువ హీరోల కథలన్నీ దాదాపు చిరు ముందు మొదట టెస్ట్ కు దిగాల్సిందే. ఆయనకు నచ్చితేనే సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంటుంది. కానీ చిత్ర లహరి విషయంలో మాత్రం పూర్తిగా సాయి ధరమ్ తేజ్ సొంత నిర్ణయం ద్వారా తెరకెక్కిందట. అయితే ఈ విషయంలో ఎవరికీ వారు కొన్ని రూమర్స్ నిజమని ఉహించుకుంటున్నారు.

మెయిన్ గా సాయి విషయంలో చిరుకి చిరాకొచ్చేసింది అంటూ ఈసారి నువ్ సొంతంగా ట్రై చేసుకో అని కుర్ర హీరోకి చిరు గీతోపదేశం చేసినట్లు టాక్. మరి అది ఎంతవరకు నిజం అనే విషయాన్నీ పక్కనపెడితే చిత్రలహరి సినిమాపై అయితే పెద్దగా అంచనాలు లేవు. ట్రైలర్ ఎదో బాగానే ఉన్నా సినిమా థియేటర్స్ కి గుంజే రేంజ్ లో లేదని అర్ధమవుతోంది. ఏదేమైనా ఫస్ట్ డేనే సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే సాయికి మినిమమ్ హిట్ అందుతుందని చెప్పవచ్చు.