సడెన్‌గా రేపిస్ట్ రాజు మృతదేహం గురువారం ఘన్‌పూర్‌ నక్కల్‌ రైల్వే ట్రాక్‌పై మృతదేహం ప్రత్యక్షమవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. రాజు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రకటించారు. మరోవైపు పోలీసులు చంపి పడేశారనే వాదన కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. 

సైదాబాద్‌ చిన్నారి ఘటనపై యావత్‌ రాష్ట్రాన్ని కదిలిస్తుంది. వారం రోజులపాటు నిందితుడు రాజుని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సడెన్‌గా రేపిస్ట్ రాజు మృతదేహం గురువారం ఘన్‌పూర్‌ నక్కల్‌ రైల్వే ట్రాక్‌పై మృతదేహం ప్రత్యక్షమవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. రాజు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రకటించారు. మరోవైపు పోలీసులు చంపి పడేశారనే వాదన కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. 

తాజాగా చిరంజీవి ట్వీట్‌ చేశారు. ఇలాంటి ఘటనలపై పౌర సమాజం బాధ్యతగా స్పందించాలన్నారు. `అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కిరాతకుడు తనకు తానే శిక్షించుకోవడం బాధిత కుటుంబంతో సహా అందరికీ కొంత ఊరట కలిగిస్తుంది. ఈ సంఘటనపై మీడియా, పౌరసమాజం గొప్పగా స్పందించాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతోపాటు పౌర సమాజం చొరవ చూపాలి. 

అలాంటి కార్యక్రమం ఎవరు చేపట్టినా వారికి నా సహకారం ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి` అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. అయితే ఈ ఘటనపై ఇప్పుడు అనేక అనుమానాలు, అనేక వాదనలు తెరపైకి రావడం విచారకరం. దీనిపై మంచు మనోజ్‌ కూడా స్పందించిన విషయం తెలిసిందే. రాజు మృతి పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

Scroll to load tweet…