మెగాస్టార్‌ చిరంజీవి తన అభిమానులకు, ప్రజలకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన కొత్త సినిమా `భోళాశంకర్‌` నుంచి కొత్త పోస్టర్‌ విడుదల చేశారు. 

మెగాస్టార్‌ చిరంజీవి చాలా సినిమాల్లో కార్మికుడి పాత్రలు పోషించారు. ఇప్పుడు మరోసారి ఆయన ఆ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం నటిస్తున్న `భోళాశంకర్‌` చిత్రంలో చిరంజీవి.. టాక్సీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. మే డే సందర్భంగా నేడు(మే 1)న `భోళాశంకర్‌` నుంచి కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో చిరంజీవి టాక్సీ కారు వద్ద స్టయిల్‌గా నిలబడి మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. బ్లూ కలర్‌ డ్రెస్‌ ధరించారు. ఓ కార్మికుడి తరహా గెటప్‌లో ఆయన లుక్‌ ఉండటం విశేషం. దీనికితోడు స్టయిల్‌గా టీ తాగుతూ కనిపించారు చిరు.

ఈ సందర్భంగా మేడే కార్మికులకు, కష్ట జీవులకు `భోళాశంకర్‌` చిత్రం నుంచి విషెస్‌ తెలియజేశారు. ఇక ఈ సినిమా విశేషాలకు విషయానికి వస్తే.. ఇందులో చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా నటిస్తుండగా, చిరు చెల్లిగా కీర్తిసురేష్‌ నటిస్తుంది. తమిళంలో విడుదలై హిట్‌ అయిన అజిత్‌ మూవీ `వేదాళం`కి రీమేక్‌ గా ఈ సినిమా రూపొందుతుంది. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర(అనిల్‌ సుంకర) నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, చాలా లావిష్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 

ఈ సినిమా సూటింగ్‌ ఇప్పటికే 80శాతం పూర్తయ్యిందట. ఇటీవల హైదరాబాద్‌ భారీ హై యాక్షన్‌ సీక్వెన్స్ ని షూట్‌ చేశారట. నెక్ట్స్ కోల్‌కతాలో చిత్రీకరణ చేస్తున్నారు. అక్కడ కీలక సన్నివేశాల చిత్రీకరించిన అనంతరం ఓ పాట కోసం యూరప్‌ వెళ్లనున్నారు. చిరంజీవి, తమన్నాలపై ఈ పాటని చిత్రీకరించనున్నారు. యూరప్‌ నుంచి తిరిగి వచ్చాక కొంత టాకీ పార్ట్స్, క్లైమాక్స్ షూట్‌, భారీ సెట్‌లో మరో సాంగ్‌ని ప్లాన్‌ చేశారట. దీంతో జూన్‌ నెలాఖరుకు సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తవుతుందట. పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ కూడా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. 

కమర్ఙియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్‌ హీరో సుశాంత్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందట. లవర్‌ బాయ్‌గా కనిపిస్తారని యూనిట్‌ పేర్కొంది. ఈ సిఇనమాకి డుడ్లీ కెమెరామెన్‌గా పనిచేయగా, మార్తాండ్‌ కే వెంకటేష్‌ ఎడిటర్‌ గా, ఏఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. కథా పర్యవేక్షణ సత్యానంద్‌, డైలాగులు తిరుమతి మామిడాల. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.