చిరంజీవి త్రో బ్యాక్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ ఫోటోలో డైరెక్టర్ కోదండరామిరెడ్డి సిగరెట్ తాగుతూ... మరో సిగరెట్ చిరంజీవికి ఆఫర్ చేశారు. వారిద్దరూ సిగరెట్స్ తాగడాన్ని పక్కనే ఉన్న హీరోయిన్ అలానే చూస్తుంది.
డైరెక్టర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. దీన్ని చిరంజీవి వంద శాతం నమ్ముతారు. ఒక చిత్ర విజయం, పరాజయంలో పూర్తి బాధ్యత దర్శకుడిదే అనేది చిరంజీవి నమ్మకం. ఆచార్య ఫెయిల్యూర్ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్ దానికి నిదర్శనం. ఆ లెక్కన చిరంజీవికి కెరీర్, స్టార్ డమ్ ప్రసాదించిన డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి. సామాన్యుడైన చిరు సుప్రీం హీరో కావడానికి అక్కడి నుండి మెగా స్టార్ గా ఎదగడానికి ఏ కోదండరామిరెడ్డి సినిమాలు ఎంతగానో దోహదం చేశాయి. వీరిద్దరి కాంబినేషన్ కాసులు కురిపించింది.
చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో చేసిన సినిమాలు అద్భుతం చేశాయి. చిరంజీవిని హీరోగా నిలబెట్టిన ఖైదీతో మొదలుకొని... అభిలాష, గూండా, ఛాలెంజ్,విజేత, దొంగ, రాక్షసుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, పసివాడి ప్రాణం, ముఠామేస్త్రి... ఇలా అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలు చేశారు. వీరి కాంబినేషన్ లో 30కి పైగా సినిమాలు తెరకెక్కినట్లు సమాచారం.
ఇక ఈ వైరల్ అవుతున్న ఫోటో 1984 నాటి రుస్తుం మూవీ సెట్స్ కి సంబంధించింది. అక్కడ అమాయకపు ముఖంతో ఉన్న హీరోయిన్ ఊర్వశి. చిరంజీవి,ఊర్వశి పై అవుట్ డోర్ షూటింగ్ జరుగుతుంది. షాట్ గ్యాప్ లో చిరంజీవికి కోదండరామిరెడ్డి సిగరెట్ తెచ్చి ఇచ్చారు. దాన్ని స్వయంగా ఆయనే వెలిగించారు. పక్కనే ఉన్న ఊర్వశి వారిద్దరినీ అలానే చూస్తూ ఉండిపోయారు. ఇద్దరి కెరీర్ దాదాపు ఒకేసారి ప్రారంభమైంది. అలాగే ఆయన దర్శకుడిగా ఈయన హీరోగా ఎదిగారు. దీంతో మంచి అనుబంధం ఉంది.
1993లో విడుదలైన ముఠామేస్త్రి మూవీ తర్వాత వీరి కాంబినేషన్ లో మరో చిత్రం రాలేదు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. మాట్లాడుకోవడం లేదనే వాదన ఉంది. ఈ ప్రశ్నకు ఏ కోదండరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అదంతా పుకారే ఎదురుపడితే చక్కగా మాట్లాడుకుంటామని ఆయన చెప్పారు.
