Asianet News TeluguAsianet News Telugu

#Chiranjeevi:'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ మీట్ కోసం స్పెషల్ ట్రైన్

. 'వాల్తేరు వీరయ్య' జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ వేగం పుంజుకున్నాయి.

Chiranjeevi Starrer Waltair Veerayya Pre release meet
Author
First Published Dec 14, 2022, 11:03 AM IST


మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజల కాంబినేషన్ లో రూపొందిన భారీ అంచనాలు వున్న మాస్ ఎంటర్ టైనర్ 'వాల్తేరు వీరయ్య' . ఈ సినిమాను 2023 సంక్రాంతికి చూడటానికి ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని  భారీగా ప్రమోట్ చేస్తున్నారు నిర్మాతలు మైత్రీ మూవీస్ వారు. ఇప్పటికే చిరంజీవికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. రవితేజ ప్రీ లుక్ పోస్టర్.. ఫస్ట్ లుక్, టీజర్ పై క్యూరియాసిటీని పెంచింది. పవర్ ఫుల్ పోలీస్-విక్రమ్ సాగర్ ఏసీపీగా రవితేజ పాత్రను పవర్ ప్యాక్డ్ గా పరిచయం చేస్తూ  ఫస్ట్ లుక్ , టీజర్ను విడుదల చేశారు మేకర్స్. బిల్డ్-అప్ షాట్ లు పర్ఫెక్ట్ ఎలివేషన్స్ ఇచ్చాయి.  ఈ నేపధ్యంలో ప్రీ రిలీజ్ మీట్ ని సైతం భారీగా చేయాలని ప్లాన్ చేస్తున్నారని మీడియా వర్గాల సమాచారం.

అందుతున్న సమాచారం మేరకు  వైజాగ్ లో జనవరి  8 న ప్రీ రిలీజ్ మీట్  జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పవన్ గెస్ట్ గా వచ్చే అవకాశం ఉందంటన్నారు. ఈ ఈవెంట్  కోసం సికిందరాబాద్ నుంచి స్పెషల్ రైలు వేసే ఆలోచనలో టీమ్ ఉందని తెలుస్తోంది.  ఇక ఈ చిత్రం యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోనున్నాయి. ఈ సీక్వెన్స్  కు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ టెర్రిఫిక్ గా కొరియోగ్రఫీ చేశారు. 'పవర్' తర్వాత తన మ్యానరిజమ్స్ , డైలాగ్ డెలివరీతో మాస్ ను అలరించే రవితేజ కోసం బాబీ మరో పవర్-ప్యాక్డ్ పాత్రను అందిస్తున్నారు. 

ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రస్తుతం యూరప్ లో లీడ్ పెయిర్ పై  పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి  రాక్ స్టార్  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత. ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా, నిరంజన్ దేవరమానె ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. 

ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్మెంట్లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. చివరి పాటను ప్రస్తుతం యూరప్ లో చిరంజీవి, శృతి హాసన్ లపై చిత్రీకరిస్తున్నారు. 'వాల్తేరు వీరయ్య' జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios